రవితేజ తో హరీష్ శంకర్ పాన్ ఇండియా మూవీ.. ఎప్పుడంటే..!?

Anilkumar
మాస్ మహారాజ రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక మాస్ మహారాజ రవితేజ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్ కి ఎంతటి క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. 2006లో షాక్ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు హరీష్ శంకర్. రవితేజ మరియు జ్యోతిక కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అనంతరం ఐదు సంవత్సరాల తర్వాత 2011లో మిరపకాయ సినిమా తో మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ అయింది. దీంతో వీరిద్దరి కాంబినేషన్ సూపర్ హిట్ గా మారింది అయితే వీరిద్దరి సెన్సిబిలిటీస్ ఆన్ స్క్రీన్ ఎగ్జిక్యూషన్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. 


ఈ క్రమంలోని వీరిద్దరి కాంబినేషన్లో మళ్లీ సినిమా వస్తే చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు  ఇద్దరి ఫ్యాన్స్. అయితే తాజా తాజా సమాచారం మేరకు వీరిద్దరి కాంబినేషన్లో భారీ బడ్జెట్ తో ఒక పాన్ ఇండియా సినిమా కోసం వీరిద్దరూ చేతులు కలపబోతున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నిజానికి ఇటీవల సోషల్ మీడియా వేదికగా దర్శకుడు హరీష్ శంకర్ రవితేజతో మూడో ప్రాజెక్ట్ పై స్పందించడం జరిగింది. అంతేకాదు త్వరలోనే రానున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఏ ఎం ఏ సెక్షన్ లో మాస్ మహారాజా రవితేజను హరిశంకర్ తో మళ్లీ


ఎప్పుడు కలిసి పని చేస్తారా అని అడగడం జరిగింది అందుకు తనదైన స్టైల్ లో ఎగ్జైటింగ్ విషయాన్ని బయట పెట్టడం జరిగింది. పిరియాడికల్ డ్రామా కోసం రవితేజతో కలిసి పని చేస్తానని మరిన్ని అప్డేట్లను త్వరలోనే రివిల్ చేస్తామని ఆయన పేర్కొన్నాడు. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాతో బిజీగా మారిన సంగతి తెలిసింది. అయితే ఈ సంవత్సరం చివరిలో ఈ సినిమా రాబోతోంది. దాని తర్వాత త్వరలోనే ఈగల్ సినిమా కూడా రాబోతుంది. పవన్ కళ్యాణ్ ఉస్తాది భగత్ సింగ్ సినిమాతో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు హరీష్ శంకర్. ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: