సినిమాల్లో అవకాశాలు లేక అలాంటి పని చేస్తున్న హనీ రోజ్..!?

Anilkumar
ప్రముఖ మలయాళీ ఇండస్ట్రీ నుండి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది హనీ రోజ్.  అంతేకాదు ఈమధ్య సోషల్ మీడియా వేదికగా గ్లామరస్ బ్యూటీగా కూడా భారీ పాపులారిటీని దక్కించుకున్న హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. ఇక ఈమె ఎలాంటి స్టిల్స్ ఇచ్చిన ఎలాంటి ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన అవి క్షణాల్లో వైరల్ అవుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రస్తుతం ఈమె ప్రత్యేక ఈవెంట్స్ లలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. అంతేకాకుండా ఎక్కడ షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కి ఈమె వెళ్ళినా కూడా అక్కడ చూడడానికి జనాలు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. 


అలా స్పెషల్ క్రేజ్ తో నిత్యం తన గ్లామరస్ ఫోటోషూట్లతో యువతను బాగా ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ ఉన్నప్పటికీ ఈమెకి సినిమాల్లో మాత్రం అవకాశం పెద్దగా లభించడం లేదు.  సంక్రాంతి కానుకగా వచ్చిన వీర సింహారెడ్డి సినిమాలో మీనాక్షి క్యారెక్టర్ లో బాలకృష్ణ కి జోడిగా నటించి ఊహించని విధంగా పాపులారిటీని దక్కించుకుంది. అనంతరం ఆ సినిమా తర్వాత సోషల్ మీడియాలో సైతం అదే క్రేజ్ తో దూసుకుపోయింది. ఈమె నటించిన వీర సింహారెడ్డి సినిమా మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ దాని తర్వాత ఈమెకి సినిమాల్లో అవకాశాలు రావడం లేదు.


 గత రెండు సంవత్సరాలుగా ఊహించని క్రేజ్ తో దూసుకుపోతున్న ఈమె ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమే అవుతుంది. 2005లోనే ఈమె మలయాళం ఇండస్ట్రీ ద్వారా వెండితెరకి పరిచయం అయ్యింది. వరుణ్ సందేశ్ తో కలిసి ఈ వర్షం సాక్షిగా అనే సినిమాలు సైతం నటించింది. ఈ సినిమా కూడా ఆమెకి పెద్దగా గుర్తింపును తేలేదు. అందుకే సౌత్ లో కన్నా మలయాళం ఇండస్ట్రీలోనే ఈమెకి ఎక్కువ అవకాశాలు వచ్చేవి. ప్రస్తుతం ఏమే వీరసింహారెడ్డి సినిమా తర్వాత క్రేజ్ లభించినప్పటికీ అవకాశాలు రాకపోవడంతో ఇలా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ చేస్తూ బిజీగా మారింది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో  భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం వల్లే ఈమెకి ఆఫర్స్ రావడం లేదని అంటున్నారు. అయితే దాదాపుగా ఒక్కో సినిమాకి నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: