మరో మల్టీస్టారర్ సినిమాలో రామ్ చరణ్.. ఈసారి ఏకంగా అలా..!?

Anilkumar
త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ల నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా ద్వారా రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లాంటి పెద్ద స్టార్ హీరోలను ఒకే సినిమాలో చూపించి తను సత్తా ఏంటో నిరూపించుకున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. అయితే ఇప్పుడు చాలా మల్టీస్టారర్ సినిమాలు వస్తున్నాయి. అయితే రామ్ చరణ్ స్వయంగా ఒక మల్టిస్తారని ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే రామచరణ్ మరొకసారి బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్


 స్టార్ యాక్టర్ తో మల్టీస్టారర్ మూవీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. నటుడు రణబీర్ సింగ్ రాంచరణ్ కలిసి ఒక హిందీ సినిమాలో నటించబోతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఇక ఈ భారీ బడ్జెట్ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయనున్నారట. అయితే ఈ సినిమాలో రణవీర్ సింగ్ భార్య బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపి  పడుకునే సైతం నటిస్తున్నారట. ఆమెతోపాటు నటి త్రిష సైతం ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు అన్న వార్తలు వినబడుతున్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక చిన్న వీడియో ఇప్పటికే విడుదలై భారీ అంచనాలు పెంచేసింది.


 ఇక ఆ వీడియోలో దీపికా పడుకునే తన భర్త అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. రన్వీర్ సింగ్ మరొకరితో మాట్లాడుతాడు. రామ్ చరణ్ పసుపు చెక్క వేసుకుని చిన్న సందు మధ్యలో ఎవరైనా పట్టుకోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అనంతరం నటి త్రిష పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసుల మధ్య  ఉంటుంది. ఇక ఆ నలుగురు స్టార్ నటినటులు కలిసి ఒక సెన్సేషనల్ థ్రిల్లర్ సినిమా తీస్తున్నట్టు తెలుస్తోంది.ఇక ఆ సినిమా పేరు షో మీ ది సీక్రెట్ అని తెలుస్తుంది. అయితే ఇది సినిమా కాదని కేవలం ప్రకటన మాత్రమే అంటూ కొందరు కొట్టి పారేస్తున్నారు. కాదు కాదు వెబ్ సిరీస్ అంటూ మరికొందరు అంటున్నారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా బయటకు రాకపోవడం తో రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: