టాలీవుడ్ యువ హీరో నాగ శౌర్య తాజాగా రంగబలి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించగా ... పవన్ బాసంసేట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని జూలై 7 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి ఈ చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో పర్వాలేదు అనే రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి.
ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ బృందం ఈ సినిమా ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తూ వస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ హీరో ఈ సినిమా ప్రమోషన్ లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా నాగ శౌర్య మాట్లాడుతూ రంగబలి మూవీ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా నాగ శౌర్య మాట్లాడుతూ ... రంగబలి మూవీ నిర్మాత చెరుకూరి సుధాకర్ కు ఇప్పటి వరకు వచ్చిన లాభాలు అన్నింటికన్నా ఈ సినిమాతో వచ్చే లాభాలు ఎక్కువ ఉంటాయి. పక్క కాన్ఫిడెన్స్ తో చెబుతున్నా ఈ మూవీ హిట్ కాదు బ్లాక్ బస్టర్ అవుతుంది అని తాజా ఇంటర్వ్యూ లో భాగంగా నాగ శౌర్య చెప్పుకొచ్చాడు.
ఇది ఇలా ఉంటే గత కొంత కాలంగా వరుస అపజయాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర డీల పడిపోయిన నాగ శౌర్య "రంగబలి" అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో తెలియాలి అంటే జూలై 7 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.