ఇండస్ట్రీ వర్గాలకు షాక్ ఇచ్చిన నిఖిల్ స్టామినా !
వాస్తవానికి ఈసినిమాను మొదటిరోజు మొదటి షోను చూసిన ప్రేక్షకులా నుండి ఏమాత్రం పాజిటివ్ టాక్ రాలేదు. అయినప్పటికీ ఈమూవీకి ఆస్థాయిలో భారీ ఓపెనింగ్స్ రావడం నిఖిల్ స్టామినాకు నిదర్శనం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ‘కార్తికేయ 2’ విడుదల అయ్యేంత వరకు కలక్షన్స్ పరంగా నిఖిల్ సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వచ్చిన సందర్భాలు చాల తక్కువ.
అయితే ‘కార్తికేయ 2’ తరువాత నిఖిల్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈమూవీ సక్సస్ తరువాత నిఖిల్ తన దగ్గరకు వచ్చే నిర్మాతలకు తన 10 కోట్ల పారితోషికాన్ని టార్గెట్ గా ఇస్తున్నట్లు టాక్. ప్రస్తుతం ధియేటర్లలో నడుస్తున్న ‘స్పై’ మూవీ మొదటిరోజు కలక్షన్స్ బాగానే ఉన్నప్పటికీ ఆసినిమాకు వచ్చిన డివైడ్ టాక్ రీత్యా రెండవ రోజు నుండి ‘స్పై’ కలక్షన్స్ 50 శాతం వరకు పడిపోయాయి అని అంటున్నారు.
ఈమూవీ నిర్మాతలు మటుకు తమ మూవీ హిట్ అంటూ ప్రచారాం చేస్తున్న విషయం తెలిసిందే. ఈసినిమాతో పోటీగా విడుదలైన శ్రీవిష్ణు ‘సామజవరగమన’ మూవీకి టోటల్ పాజిటివ్ టాక్ రావడంతో పాటు రివ్యూలు కూడ చాల బాగా వచ్చినప్పటికీ ఈమూవీ కలక్షన్స్ ఈసినిమాకు వచ్చిన హిట్ టాక్ రేంజ్ లో లేవు అని అంటున్నారు. మల్టీ ప్లెక్స్ ప్రేక్షకుడు మాత్రం ‘సామజవరగమన’ సినిమాను చూసి ఈ వీకెండ్ ను ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. దీనితో గతవారం రేస్ లో నిఖిల్ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ అతడి ఇమేజ్ కొంతవరకు ‘స్పై’ ని రక్షించ వచ్చు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..