చిరంజీవి కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 3 మూవీలు ఇవే..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోల్లో ఒకరు అయినటు వంటి మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించాడు. ఇది ఇలా ఉంటే చిరంజీవి కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 3 మూవీ లు ఏవో తెలుసుకుందాం.

సైరా నరసింహా రెడ్డి : చిరంజీవి హీరో గా రూపొందిన ఈ సినిమాలో నయన తార ... తమన్నా హీరోయిన్ లుగా నటించగా ... స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో అమితా బచ్చన్ ... విజయ్ సేతుపతి ... కిచ్చా సుదీప్ ... జగపతి బాబు కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 240 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

వాల్టేర్ వీరయ్య : చిరంజీవి హీరోగా రూపొందిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... బాబీ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మైత్రి మూవీ సంస్థ వారు నిర్మించిన ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీ 230 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఖైదీ నెంబర్ 150 : చిరంజీవి హీరోగా రూపొందిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా వి వి వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 165 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: