కన్నడ స్టార్ హీరో సూపర్ స్టార్ ఉపేంద్ర గురించి ప్రత్యేక చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో వైవిధ్యమైన కథలతో చక్కటి సినిమాలు తీసే ఈ వెర్సటైల్ హీరోకు తెలుగునాట కూడా భారీగా అభిమానులు ఉన్నారు.ఉపేంద్ర నటించిన కన్నడ డబ్బింగ్ సినిమాలు తెలుగులో కూడా సూపర్‌హిట్‌గా నిలిచాయి. ఈ క్రేజ్‌తోనే రక్తకన్నీరు, కన్యాదానం ఇంకా సన్నాఫ్ సత్యమూర్తి వంటి స్ట్రెయిట్ తెలుగు సినిమాల్లో కూడా నటించి తెలుగులో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించాడు. కేవలం హీరోగా మాత్రమే కాకుండా డైరెక్టర్‌గా కూడా సత్తా చాటుతున్నాడు ఉపేంద్ర. రీసెంట్ గా కబ్జా అంటూ పాన్ ఇండియా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ మూవీ పెద్దగా ఆడలేదు.అయితే ఇప్పుడు ఆ లోటును తీర్చుకునేందుకు మరో కొత్త మూవీని స్టార్ట్ చేశాడు ఉపేంద్ర. ఆ సినిమానే బుద్ధివంత 2. 2009 వ సంవత్సరంలో రిలీజై హిట్‌గా నిలిచిన బుద్ధివంత (తెలుగులో బుద్ధిమంతుడు) మూవీకి ఇది సీక్వెల్.
తాజాగా దీనికి సంబంధించి రిలీజైన ఉపేంద్ర ఫస్ట్‌లుక్ అయితే ఆయన అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.ఇందులో ముఖానికి మాస్క్ ఇంకా చిందరవందర జుట్టుతో చాలా డిఫరెంట్ లుక్‌తో కనిపించాడు ఉపేంద్ర.ఇక ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటోన్న బుద్ధివంత 2 మూవీని ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదల చేస్తామని చిత్రబృందం తెలిపింది. టిఆర్ చంద్రశేఖర్ నిర్మిస్తున్న 'బుద్ధివంత 2' చిత్రానికి జయరామ్ మాధవన్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ మూవీలో చాలా మంది ఆర్టిస్టులు నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఇంకా దీంతో పాటు ఉపేంద్ర ‘యుఐ’ చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆయనే స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు.మరి చూడాలి ఈ సినిమాలతో ఉపేంద్ర కంబ్యాక్ హిట్లు కొడతాడో లేదో..గత కొంతకాలం నుంచి వరుస ప్లాపులతో వున్న ఉపేంద్రకి బ్రేక్ వస్తుందో రాదో చూడాలి.