నాని వెంకటేష్ లను కార్నర్ చేస్తున్న పవన్ మ్యానియా !
పవన్ గ్యాంగ్ ష్టర్ గా ఈమూవీలో కనిపించడంతో పాటు ఈమూవీకి సుజిత్ దర్శకత్వం వహించడంతో మూవీపై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ కెరియర్ లో ఎప్పుడు లేనివిధంగా ఈమూవీని చాలా వేగంగా పూర్తి చేయడం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఈమూవీలో నటించినందుకు పవన్ కు 75 కోట్ల పారితోషికం ఇచ్చారు అన్న వార్తలు మరింత సంచలనంగా మారాయి.
ఇది ఇలా ఉంటే ఈమూవీ క్రిస్మస్ ను టార్గెట్ చేస్తూ విడుదల ఒక న్యూస్ అయితే ఈమూవీకి పోటీగా వెంకటేష్ నాని సినిమాలు కూడ విడుదల అవుతూ ఉండటం మరింత సంచలనంగా మారింది. వెంకటేష్ కెరియర్ లో 75వ సినిమాగా నిర్మాణం జరుపుకుంటున్న ‘సైంధవ్’ క్రిస్మస్ రేస్ కు విడుదల కాబోతోంది. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ టీజర్ కు వచ్చిన స్పందన చూస్తే ఈమూవీ వెంకీ కి గ్యారెంటీ హిట్ అన్న ప్రచారం జరుగుతోంది..
ఇప్పటికే ఈమూవీ టీజర్ కు మంచి స్పందన రావడంతో చాలకాలం తరువాత వెంకటేష్ కు హిట్ వస్తుంది అన్న అంచనాలు ఉన్నాయి. ఇదే క్రిస్మస్ ను టార్గెట్ చేస్తూ నాని నటించిన లేటెస్ట్ మూవీ కూడ విడుదల కాబోతోంది. గతంలో క్రిస్మస్ కు విడుదలై హిట్ కొట్టిన ‘ఎమ్ సిఎ’ ‘ శ్యామ్ సింగరాయ్’ సినిమాల సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ మరొక హిట్ కొట్టాలని నాని ఈ క్రిస్మస్ సీజన్ లో కూడ ప్రయత్నిస్తున్నాడు. అయితే పవన్ సినిమాను లెక్కచేయకుండా అటు నాని ఇటు వెంకటేష్ సినిమాలు వస్తూ ఉండటంతో ఈ సంవత్సరం క్రిస్మస్ రేస్ ఆశక్తికరంగా మారింది..