ఆ ఒక్క విషయం.. నన్నెంతో బాధిస్తుంది : తమన్నా
ఈ క్రమంలోనే తమన్నా పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయితే తనపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్ గురించి ఇటీవల తమన్నా స్పందించింది. తాను 14 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడే తమ అభిప్రాయాలను తనపై రుద్దాలని ఎంతో మంది చూశారు అంటూ చెప్పుకోచ్చింది. ఇక 18 ఏళ్ల సినీ కెరియర్ లో ఎన్నో విమర్శలు చూసాను. నా తొలి అడుగు వేసే సమయంలో మీ అమ్మాయిని ఇండస్ట్రీలోకి ఎందుకు పంపుతున్నారు.
పరిశ్రమ ఎలా ఉంటుందో తెలుసా అంటూ ఎంతో మంది తెలిసిన వాళ్ళు నా తల్లిదండ్రులku చెప్పారు. ఒకవేళ ఆనాడు వాళ్ళ మాటలు పట్టించుకోని ఉంటే.. నేను ఈ స్థాయిలో ఉండే దాన్ని కాదు ఇప్పుడు సోషల్ మీడియా వేదిక ఎంత మంది వ్యక్తులు కామెంట్ చేస్తున్నారు. కానీ నేను వాటిని అస్సలు పట్టించుకోను. 2023లో ఎవరు ఎలా ఉండాలి అనేది మీరు ఎలా చెబుతారు. ముక్కు ముఖం తెలియని కొంతమంది వ్యక్తులు చేసే కామెంట్స్ హైలెట్ చేస్తూ వార్తలు సృష్టిస్తున్నారు. ఆ ఒక్క విషయమే నన్ను ఎంతో బాధిస్తుంది. వర్క్ విషయంలో విమర్శలు చేస్తే మరోసారి అలాంటి తప్పు జరగకుండా చూసుకుంటా అంటూ తమన్న చెప్పుకొచ్చింది. కాగా సినిమా ఆఫర్లు తగ్గిపోవడంతో ఇక ఇప్పుడు తమన్నా అటు వెబ్ సిరీస్ ల ద్వారా బిజీగా ఉంది. అదే సమయంలో మితిమీరిన రొమాంటిక్ సన్నివేశాలలో కూడా నటిస్తుంది ఈ హీరోయిన్.