ఓవర్సీస్ లో "స్పై" మూవీకి సూపర్ రెస్పాన్స్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటువంటి నిఖిల్ తాజాగా "స్పై" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ తాజాగా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ లభించింది. అయినప్పటికీ ఈ మూవీ కి మొదటి రోజు మంచి కలెక్షన్ లు ప్రపంచ వ్యాప్తంగా దక్కాయి. ముఖ్యంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు సూపర్ సాలిడ్ కలెక్షన్ లు దక్కినట్లు తెలుస్తోంది.
 


ఇకపోతే ఈ మూవీ కి మొదటి రోజు ఓవర్ సిస్ లో కూడా సూపర్ రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు ఓవర్సీస్ లో వచ్చిన కలెక్షన్ లను తెలియ జేస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ లో ఈ సినిమాకు ఓవర్ సీస్ లో 267 కే ప్లస్ కలెక్షన్ లు వచ్చినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఈ మూవీ యూనిట్ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటికే కార్తికేయ 2 ... 18 పేజెస్ మూవీ లతో మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న నిఖిల్ "స్పై" మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.


ఇకపోతే ఈ సినిమాకు గర్రి బి హెచ్ దర్శకత్వం వహించగా ... ఐశ్వర్య మీనన్ ఈ సినిమాలో నిఖిల్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని దర్శకుడు అదిరిపోయే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: