టాలీవుడ్ లో ఈ జనరేషన్ కమెడియన్స్ లో సత్య కూడా ఒకడు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను నవ్వించిన సత్య కమెడియన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మధ్యకాలంలో కమెడియన్ గా కాస్త గ్యాప్ తీసుకున్న సత్య ఇప్పుడు నాగశౌర్యతో కలిసి 'రంగబలి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పవన్ భాసం శెట్టి ఈ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. జూలై 7వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇక రిలీజ్ టైం దగ్గర పడడంతో మూవీ టీం ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే ఈ మధ్య ఎక్కడ చూసినా 'రంగబలి' మూవీ ప్రమోషన్స్ లో హీరో నాగశౌర్య, కమెడియన్ సత్య మాత్రమే కనిపిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్లో నాగశౌర్య సత్యా ల కామెడీ టైమింగ్, డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కమెడియన్ సత్య ట్రైలర్లో 'స్పెర్మ్ ను రోడ్ మీద తేనె అమ్మినట్టు అమ్మేద్దాం' అంటూ చెప్పిన డైలాగ్ హైలెట్ గా నిలిచింది. ఈ క్రమంలోనే తాజాగా వీరిద్దరితో ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ని ప్లాన్ చేశారు మూవీ టీం. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ కు సంబంధించిన ప్రోమో వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. అందుకు కారణం ఈ వీడియోలో కమెడియన్ సత్య కొంతమంది ప్రముఖ జర్నలిస్టులను ఇమిటేట్ చేస్తూ నాగశౌర్యను ఇంటర్వ్యూ చేయడమే.
తాజాగా విడుదలైన ఈ ప్రోమోలో టీవీ చానల్స్, యూట్యూబ్ ఛానల్స్, ఇంటర్వ్యూస్ లో ప్రెస్ మీట్స్ లో వివాదాస్పద ప్రశ్నలు వేసే విలేకరులను సత్య వాళ్ల గెటప్స్ లో ఇమిటేట్ చేస్తూ అచ్చంగా వాళ్ళని దించేశారు. చాలా అద్భుతంగా ఇమిటేట్ చేయడంతో సోషల్ మీడియాలో ఈ ప్రోమో కాస్త వైరల్ అవుతుంది. ప్రోమో చివరలో టీవీ9 ప్రముఖ యాంకర్ ని ఇమిటేట్ చేస్తూ 'గెటవుట్ ఫ్రమ్ మై స్టూడియో' అంటూ అరవడం ప్రోమో మొత్తానికే హైలెట్గా మారింది. ఇక ఈ ప్రోమో చూసినా నెటిజెన్స్ అయితే ఈ ఫుల్ ఇంటర్వ్యూ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. కచ్చితంగా ఈ ఇంటర్వ్యూ 'రంగబలి' సినిమా ప్రమోషన్స్ కి చాలా పెద్ద ప్లస్ అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు. కాగా SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాలో నాగశౌర్య సరసన యుక్తి తరేజ హీరోయిన్గా నటించింది. పవన్ సిహెచ్ స్వరాలు సమకూర్చారు.