విజయ్ సేతుపతి ఎన్ని అవమానాలను ఎదుర్కొన్నాడో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
విజయ్ సేతుపతి పేరు తెలియని సౌత్ ఆడియన్స్ ఉండరు అనడంలో ఎటువంటి సందేహం లేదు. తన విలక్షణ నటనతో తను ఏంటో నిరూపించుకున్నాడు విజయ్ సేతుపతి. తమిళంలో పిజ్జా సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు విజయ్ సేతుపతి.దాని తరువాత వరుస సినిమాలలో నటించి ఆకట్టుకున్నాడు. హీరోగా సినిమాలు చేస్తూనే విలన్ గా కూడా మెప్పించాడు విజయ్ సేతుపతి. ఇక తన అభిమానుల చేత మక్కల్ సెల్వన్ అని పిలిపించుకునే విజయ్ సేతుపతి. తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా ఇష్టం. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు ఈయన. 


దానితోపాటు మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమాలో సైతం ఒక చిన్న పాత్రలో మెరిసాడు ఈయన. దళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమాలో సైతం విలన్ గా మెప్పించాడు. దాంతో పాటు కమలహాసన్ నటించిన విక్రమ్ సినిమాలో సైతం విలన్ గా నటించి తన నట విశ్వరూపాన్ని చూపించాడు. అయితే ఇటీవల ఆయన హిందీలో ఒక వెబ్ సిరీస్ ని సైతం చేశారు విజయ్ సేతుపతి. కెరీర్ బిగినింగ్ లో చాలా అవమానాలు గురయ్యాయట .ఇక ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ అయ్యాడు విజయ్ సేతుపతి ఇప్పుడు ఇండియాలోనే బెస్ట్ నటుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు.


అయితే ఇటీవల ఆయన ఒక ఇంటర్ కిలో పాల్గొనడం జరిగింది. ఇక ఇంటర్వ్యూలో భాగంగా తన కెరియర్లో ఆయన ఎదుర్కొన్న సమస్యలను గురించి తెలుపుతూ ఎమోషనల్ అయ్యారు. థియేటర్లో అకౌంటెంట్గా పనిచేసే ఆ సమయంలోనే అవకాశాల కోసం ఎంతో ప్రయత్నించాను ఫోటోలు పట్టుకుని ఆఫీసులో చుట్టూ రోజూ తిరిగేవాడిని .అంతేకాదు అప్పుడు నేను అనేక రకాల అవమానాలను ఎదుర్కొన్నాను. నన్ను చూడగానే నీ ముఖానికి సినిమాలు కూడానా అని చాలామంది అనేవారు. కొంతమంది నా ఫోటోలను చూడడానికి కూడా ఇష్టపడేవారు కాదు. మరి కొంతమంది అవకాశం ఇచ్చి తీరా సెట్స్ కి వెళ్ళిన తర్వాత ఆ పాత్ర మరొకరితో చేయించుకునేవారు .అంటూ తెలుపుతూ చాలా ఎమోషనల్ అయ్యారు .కానీ నేను ఎప్పుడూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు అంటూ చెప్పుకోవచ్చు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: