నాగార్జున 'శివమణి' మొదట ఎవరిదగ్గరికి వెళ్లిందో తెలుసా?
ఈ మూవీ స్టోరీని ముందుగా విక్టరీ వెంకటేష్ కోసం రాసుకున్నారట పూరీ జగన్నాధ్. అయితే వెంకీకి ఫస్ట్ హాప్ బాగా నచ్చింది కానీ.. సెకండ్ హాఫ్ ఆయనికి నచ్చకపోవడంతో ఆయన ఈ కథను రిజక్ట్ చేశారట. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక సినిమాలాగా.. సెకండ్ హాఫ్ మొత్తం మరో సినిమాలాగా అనిపిస్తుందని ఫీల్ అయ్యాడట వెంకీ. అయితే కథలో మార్పులు చేసేందుకు స్కోప్ లేకపోవడంతో వెంకీ ఈ సినిమాకు నో చెప్పారట. ఆ తర్వాత కొన్నాళ్లకు ఇదే కథను నాగార్జునకు చెప్పగా.. నాగ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.
అలా నాగ్, పూరీ కాంబోలో తెరకెక్కిన శివమణి సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించింది. అవును, భారీ అంచనాల మధ్య అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా.. కమర్షియల్ గా హిట్ అయ్యింది. దాంతో అక్కినేని ఫాన్స్ అయితే సంబరాలు చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. అప్పట్లోనే ఈ సినిమా దాదాపు 14 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టింది భోగట్టా. అయితే వెంకీ చెప్పినట్లుగానే ఫస్ట్ హాఫ్ జనాలకు తెగ నచ్చగా సెకండ్ హాఫ్ పై మాత్రం మిక్స్డ్ టాక్ వచ్చింది. ఏది ఏమైనా సినిమా ప్రేక్షకులు మాత్రం ఫస్ట్ హాఫ్ కోసమే ఈ సినిమాకు వెళ్లేవారు. అలా ఈ సినిమా సంచలన విజయం నమోదు చేసింది.