చిరు కొత్త సినిమా షురూ... 17ఏళ్ల తర్వాత ఆమెతో జతకడుతున్న మెగాస్టార్?

praveen
మెగాస్టార్ చిరంజీవి గురించి దేశ ప్రజలకు పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. 67 ఏళ్ల మెగాస్టార్ నేటికీ హీరోగా సినిమాలు చేస్తూ మంచి బిజీగా గడుపుతున్నారు. అసలు విషయంలోకి వెళితే చిరు... తనయుడు రామ్ చరణ్ తో కలిసి, మల్టీస్టారర్ సినిమా 'ఆచార్య' సినిమాలో నటించగా ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. మరలా ఇప్పుడు ఆయన మరోసారి మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా తండ్రి పాత్రలో చిరంజీవి కనిపించనున్నారని వినికిడి. దాంతో ఈ వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.

వివరాల్లోకి వెళితే... ఆయన నెక్ట్స్ సినిమాపై ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ న్యూస్ బయటకు రావడంతో మెగాభిమానులు పండగ చేసుకుంటున్న పరిస్థితి. చిరంజీవి, దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ చిరంజీవికి కల్యాణ్‌ కృష్ణ ఓ కథ వినిపించారని, ఈ స్క్రిప్ట్‌ చిరంజీవికి పిచ్చిపిచ్చిగా నచ్చిందని, త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఆ వార్తల సారాంశం. అయితే ఈ సినిమాలో చిరంజీవి తండ్రిగా నటిస్తే.. కుమారుడుగా ఓ యంగ్ హీరో నటించనున్నట్లు సమాచారం. ఆ హీరో ఎవరనేది ఇపుడు ప్రశ్నగా మారింది.

తండ్రి కొడుకుల సెంటిమెంట్ కథగా రాబోతున్న ఈ సినిమాలో తండ్రి పాత్రలో చిరంజీవి నటించగా.. కొడుకు పాత్రకు సిద్ధు జొన్నలగడ్డని అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో చిరుకు జోడిగా త్రిష నటించనుందని వినికిడి. అవును, 17 ఏళ్ల తర్వాత చిరు త్రిషలు ఈ సినిమాలో నటించబోతున్నారనే విషయం తెలియడంతో చిరు అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఇక సిద్ధూకు జోడీగా శ్రీలీల నటించనుందని టాక్ వినబడుతోంది. ఇక శ్రీలీల ఈమధ్య వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. మొన్న మహేశ్, పవన్ సినిమాలో ఛాన్స్ దక్కించుకోగా.. ఇప్పుడు చిరు సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: