"మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" మూవీ సాటిలైట్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించిన అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సూపర్ మూవీ.తో వెండి తెరకు పరిచయం అయిన ఈనటి ఈ మూవీ తోనే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న ఎంతో మంది స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించింది.


ఇది ఇలా ఉంటే ఈనటికీ అరుంధతి ... బాహుబలి సిరీస్ మూవీ ల ద్వారా నటిగా అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ నటి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ లో యువ నటుడు నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా భాగం షూటింగ్ పూర్తి అయ్యింది  ప్రస్తుతం కూడా ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.


అసలు విషయం లోకి వెళితే ... ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన సాటిలైట్ హక్కులను అమ్మివేసింది అని ... అందులో భాగంగా ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ లలో ఒకటి అయినటువంటి జీ సంస్థ దక్కించుకున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: