పవర్ ఫుల్ టైటిల్ తో.. అఖిల్ నెక్స్ట్ మూవీ?

praveen
అక్కినేని అనే భారీ బ్యాక్ గ్రౌండ్ నుంచి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఇంకా స్టార్ హీరో కావడానికి ఎన్నో కష్టాలు పడుతున్నాడు అన్న విషయం తెలిసిందే. భారీ హైప్ తోనే హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఎందుకో అఖిల్ నటించిన సినిమాలు మాత్రం పెద్దగా హిట్ సాధించడం లేదు. అయితే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అనే సినిమాతో ఒక మోస్తారు హిట్ అందుకున్న అఖిల్.. ఇటీవల ఏజెంట్ అనే ఒక భారీ బడ్జెట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. స్పై థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది.

 ఈ క్రమంలోనే అఖిల్ కెరియర్ ఈ సినిమాతో ముగిసిపోయింది అంటూ ఎన్నో వార్తలు కూడా తెరమీదికి  వచ్చాయి అని చెప్పాలి. అయితే ఏజెంట్ సినిమాతో తీవ్రంగా నిరాశలో మునిగిపోయిన అఖిల్.. తన తర్వాత సినిమాల విషయంలో మాత్రం కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్నాడు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే చాలా రోజుల కింద ఒక సినిమా ఓకే చేసినప్పటికీ.. ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ విషయంలో మాత్రం దర్శక నిర్మాతలు లెక్కలు వేసుకుంటున్నారు అనే వార్తలు కూడా బయటకు వస్తున్నాయి.

 అంతేకాదు ఇక అఖిల్ సినిమాకు అటు టైటిల్ కూడా ఫిక్స్ చేశారట. ఫాంటసీ అడ్వెంచర్ కథాంశంతో అఖిల్ కొత్త సినిమా ఉండబోతుంది అన్నది తెలుస్తుంది. సాహో సినిమా డైరెక్షన్ టీం లో పనిచేసిన అనిల్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడట. అఖిల్ కోసం ప్రత్యేకంగా రాసుకున్న ఒక కథను అనిల్ వినిపించాడట. కాగా కథ బాగా నచ్చడంతో అఖిల్ కూడా వెంటనే ఓకే చెప్పేసాడట. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. ఈ సినిమాకు ధీర అనే టైటిల్ ఫిక్స్ చేశారు అని టాక్ వినిపిస్తుంది. యువీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించబోతుందట. ఇప్పటికే వరుసగా ఎదురు దెబ్బలు తిన్న యూవీ క్రియేషన్స్ ఇక అఖిల్ తో సినిమాపై మాత్రం ఎంతో నమ్మకంతో ఉంది అన్నది తెలుస్తుంది. కాగా దీనిపై అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: