ఆ వ్యాధి తో బాధపడుతున్న మెగా ఫ్యామిలీ మెంబెర్ ....!!

murali krishna
ఈ మధ్య చాలామంది నటీనటులు వింత వ్యాధులతో బాధపడుతున్నారు అనే విషయాలు బాగా లీక్ అవుతున్న సంగతి తెలిసిందే. కొందరు తమకున్న వింత సమస్యల గురించి ఓపెన్ గా చెబుతుంటే మరి కొంతమంది సమస్యలు తమ సన్నిహితుల ద్వారా బయటపడుతున్నాయి.ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు సెలబ్రెటీలు కొన్ని రకాల వ్యాధులతో బాధపడుతున్నారు. అయితే తాజాగా ఆ లిస్టులోకి చేరింది మెగా కోడలు లావణ్య త్రిపాఠి. ఇంతకు ఆమెకున్న సమస్య ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా వరుణ్ తేజ్ తో ఎంగేజ్మెంట్ చేసుకొని మెగా వారి కోడలుగా కూడా అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంది. లావణ్య తొలిసారిగా 2008లో అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా సినీ పరిశ్రమకు పరిచయం అయింది. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది లావణ్య. అంతే కాకుండా హిందీలో, తమిళ భాషల్లో కూడా కొన్ని సినిమాలలో నటించింది. స్టార్ హీరోల సరసన సైతం నటించింది. ఆ మధ్య పలు సినిమాలలో నటించగా ఆ సినిమాలు లావణ్యను నిరాశపరిచాయి. ఈ మధ్య ఓటీటీలో విడుదలయ్యే సినిమాలలో కూడా నటిస్తుంది. ఆ ప్లాట్ఫారం వేదికగా కొంతవరకు సక్సెస్ అందుకుంటుంది.ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గానే కనిపిస్తుంది. ఇక తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది. తనకు సంబంధించిన గ్లామర్ ఫోటోలను కూడా షేర్ చేసుకుంటుంది. ఇక తనతో కలిసి నటించిన వరుణ్ తేజ్తో ప్రేమలో పడి రీసెంట్గా తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో వాళ్లకి చెప్పి ఒప్పించుకొని నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక త్వరలో పెళ్లి ముహూర్తం కూడా పెట్టుకోనున్నారు. ఇక వీరి ఎంగేజ్మెంట్ జరిగినప్పటి నుంచి వీరి గురించి ఏదో ఒక వార్త బాగా వైరల్ అవుతూనే ఉంది. అయితే తాజాగా లావణ్య గురించి ఒక విషయం తెలిసింది. అదేంటంటే తనకు ఒక వింత వ్యాధి ఉందని.. ఇక తనకున్న సమస్య గురించి స్వయంగా తానే తెలిపిందని తెలిసింది. మామూలుగా తను ఎంతో ధైర్యంగా ఉంటుందని.. కానీ ఈ మధ్యకాలంలో తను కొన్ని వస్తువులను చూసిన, కొన్ని ఆకారాలను చూస్తున్న పనులు తెలియకుండానే భయం పుడుతుందని తెలిసింది. ఇక ఈ విషయాన్ని డాక్టర్ కి తెలిపితే తనకు ట్రిపోఫోబియా ఉందని అన్నాడట.ఇక ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా వైరల్ అవ్వగా.. మెగా వారి కోడలికి ఒక లోపం ఉంది అంటూ.. తను వింత సమస్యతో బాధపడుతుంది అంటూ బాగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇక మరి కొంతమంది.. కాబోయే భార్యకు ఇటువంటి వ్యాధి ఉంటే భవిష్యత్తులో వరుణ్ కు కష్టాలు తప్పవా అంటూ కొందరు జనాలు అనుమానం పడుతున్నారు. మరి భార్యపై వస్తున్న ట్రోల్స్ గురించి వరుణ్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: