ఉదయ్ కిరణ్ - బాలయ్య కాంబినేషన్లో.. తెరకెక్కిన సినిమా ఏదో తెలుసా?
కానీ ఆ తర్వాత మాత్రం దురదృష్టవశాత్తు ఉదయ్‌కిరణ్ నటించిన సినిమాలన్నీ క్రమక్రమంగా ఫ్లాప్ కావడంతో తీవ్రంగా నష్టపోయి చివరికి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు ఉదయ్ కిరణ్. ఇక ఉదయ్ కిరణ్ ఆత్మహత్యతో అటు ఇండస్ట్రీ మొత్తం విషాదంలో మునిగిపోయింది అని చెప్పాలి. అయితే ఉదయ్ కిరణ్ ఈ లోకంలో లేకపోయినప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో మాత్రం జరగని ముద్ర వేసుకున్నారు. ఇకపోతే యంగ్ హీరో ఉదయ్ కిరణ్, సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కలిసి ఒక సినిమా కోసం పని చేశారన్న విషయం చాలా మందికి తెలియదు.
ఆ వివరాలు చూసుకుంటే.. బాలకృష్ణ నటించిన నర్తనశాల సినిమాలో ఉదయ్ కిరణ్ కు నటించే అవకాశం దక్కిందట. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ సమయానికి సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయ్. 2004 మార్చి నెలలో రామోజీ ఫిలిం సిటీ లో వేసిన పర్ణశాల స్టేట్‌లో బాలయ్య, ఉదయ్ కిరణ్ ఈ ఫోటోలు దిగారు అన్నది తెలుస్తుంది. కాక ఈ సినిమాలో బాలకృష్ణకు జోడిగా సౌందర్య నటించగా.. ఉదయ్ కిరణ్ ను అభిమన్యుడి పాత్ర కోసం తీసుకున్నారు. అయితే ఈ సినిమా మాత్రం ప్రేక్షకుల ముందుకు రాలేకపోయింది. సౌందర్య అకాల మరణంతో సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఒకవేళ పరిస్థితులు అనుకూలించి ఉంటే బాలయ్య ఉదయ్ కిరణ్ కాంబినేషన్లో ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది అని చెప్పాలి.