బాలయ్య భైరవద్వీపం.. అప్పట్లోనే ఎంత వసూళ్లు సాధించిందో తెలుసా?
అయితే నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టడమే కాదు ప్రతి ప్రేక్షకుడి మదిలో చెరగని ముద్ర వేసుకున్నాయ్. ముఖ్యం గా బాలయ్య కెరియర్లో ఎన్నో సూపర్హిట్లు ఉన్నప్పటికీ భైరవద్వీపం క్లాసిక్ హిట్ సినిమా మాత్రం ఇప్పటి వరకు మళ్లీ తీయలేదు. సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది అన్న విషయం తెలిసిందే. ఇక అప్పట్లోనే కాస్త ఫ్యూచర్ విజన్ తో ఆలోచించిన సంగీతం శ్రీనివాసరావు తన సినిమాలతో సూపర్ సక్సెస్ అయ్యారు.
అయితే భైరవ ద్వీపం సినిమాతో బాలయ్యకి ఎంత మంచి గుర్తింపు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ సినిమా అప్పట్లోనే రికార్డు స్థాయి వసూళ్లను సాధించిందట. కేవలం ఐదు కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. కానీ ఇక ఈ సినిమా ఫుల్ రన్ లో దాదాపు 19 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్స్ ని రాబట్టిందట. దీని బట్టి చూస్తే ఆ రోజుల్లోనే సినిమాని జనాలు ఎంతలా ఎగబడి చూశారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పటి దర్శకులు అయితే భైరవద్వీపం లాంటి సినిమాలో తెరకెక్కించడం కాస్త అసాధ్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు. ముఖ్యంగా భైరవద్వీపం సినిమాలో నరుడా ఓ నరుడా అనే పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది.