మ్యారేజ్ జరిగిన రెండు వారాలకే విడాకులు తీసుకున్న జంట....!!
వీళ్లిద్దరూ ఒకరినొకరు దూషించుకుంటూ సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని రాజ్యలక్ష్మి కామెంట్లు చేశారు. సంయుత మాట్లాడుతూ తన మాజీ భర్త చెత్త వీడియోలను చూపించేవాడని శారీరక బంధంపై మాత్రమే ఆసక్తి చూపుతున్నాడని బెడ్ రూమ్ లో కెమెరాలు పెట్టాడని చెప్పుకొచ్చారు. విష్ణుకాంత్ మాట్లాడుతూ తన భార్యకు మరో వ్యక్తితో రిలేషన్ ఉందని ఆరోపణలు చేశారు. రాజ్యలక్ష్మి విషయానికి వస్తే ఈమె పుష్ప ది రైజ్ సినిమా లోని సామి సామి సాంగ్ తమిళ వెర్షన్ పాడిన సింగర్ కావడం గమనార్హం. ఈ సింగర్ చేసిన ఆరోపణలు సంచలనం అవుతున్నాయి. ఈ సింగర్ ఇప్పటికీ వరుస ఆఫర్లతో కెరీర్ పరం గా బిజీ గా ఉన్నారు. పెళ్లైన 15 రోజులకే విడాకులు తీసుకోవాలనుకునే జంటలకు పెళ్లి అవసరమా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ బుల్లితెర జంటపై తీవ్రస్థాయి లో ట్రోల్స్ వస్తుండటం గమనార్హం.