యమ స్పీడ్ మీదున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్....!!

murali krishna
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక క్రేజీ సినిమా చేసి చాలా రోజులు అయ్యింది. అనితర సాధ్యమైన స్టార్ స్టేటస్ ఉన్న పవన్ కళ్యాణ్ తన రేంజ్ కి తగ్గ సినిమాలు చెయ్యడం లేదని అభిమానులు ఎప్పటి నుండో బాధపడుతున్నారు.తన తోటి స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజ్ సినిమాలు చేస్తూ ఇతర భాషల్లో కూడా మార్కెట్ ని సంపాదించుకుంటూ ముందుకు పోతుంటే పవన్ కళ్యాణ్ కేవలం తెలుగు మార్కెట్ కి మాత్రమే పరిమితం అయిపోయాడే అని బాధ ప్రతీ ఒక్కరిలో ఉండేది. దానికి తోడు ఆయన ఈ ఓటీటీ కాలం లో కూడా రీమేక్ సినిమాలు చెయ్యడం అభిమానులకు జీర్ణించుకోలేని విషయం. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో క్షణం తీరిక లేకుండా ఉండడం వల్లే ఇలా పెద్ద ప్రాజెక్ట్స్ చేయలేకపోతున్నాడు అనేది పవన్ కళ్యాణ్ సన్నిహితులు చెప్తున్న మాట.
అయితే అభిమానుల బాధ పవన్ కళ్యాణ్ వరకు చేరింది అనుకుంట, అందుకే ఆయన ఇతర హీరోల అభిమానులు కూడా కుళ్ళుకునే రేంజ్ ప్రాజెక్ట్స్ ని సెట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన లైనప్ లో ఉన్న 'OG', 'ఉస్తాద్ భగత్ సింగ్' మరియు 'హరి హర వీరమల్లు' చిత్రాలకు ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ లో మామూలు క్రేజ్ లేదు. వీటిల్లో ముందుగా మనం OG గురించి మాట్లాడుకోవాలి. ఈ చిత్రం పై ఉన్న అంచనాలు ఇది వరకు ఏ పవన్ కళ్యాణ్ సినిమా మీద కూడా లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. నిన్న గాక మొన్న ప్రారంభం అయ్యినట్టు అనిపిస్తున్న ఈ సినిమా షూటింగ్ అప్పుడే 50 శాతం పూర్తి అయ్యిందట. ఈ సందర్భం గా సోషల్ మీడియా లో మూవీ టీం అధికారికంగా ఒక పోస్ట్ వేస్తూ తెలిపింది.యాక్షన్ , ఎపిక్, డ్రామా ఇవన్నీ కలిపిన సినిమానే మా #OG. ఇప్పటి వరకు 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నాము. తదుపరి షెడ్యూల్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. నీ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ మీద ఒక పాట, ఒక యాక్షన్ సన్నివేశం, మరియు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారట. ఆయన పాత్రకి సంబంధించి కేవలం ఒక 30 రోజులు కాల్ షీట్స్ ఇస్తే సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందని అంటున్నారు మేకర్స్. ఆగస్టు నుండి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని పూర్తి చేసి, ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఈ సినిమాని తెలుగు , తమిళం , హిందీ మరియు మలయాళం బాషలలో గ్రాండ్ గా పాన్ ఇండియన్ లెవెల్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కి జోడిగా ప్రియాంక మోహన్ నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే, బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: