రజినీకాంత్ మూవీతో రీఎంట్రీ ఇవ్వబోతున్న సీనియర్ నటి....!!
ఇలా రజనీకాంత్ అతిథి పాత్రలో నటిస్తున్నటువంటి లాల్ సలాం సినిమా ద్వారా సీనియర్ నటి నిరోష తిరిగి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు.ఇక ఈ సినిమా ద్వారా ఈమె ఎవరో సారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. అయితే నిరోషా ఈ సినిమాలో రజనీకాంత్ కు చెల్లెలి పాత్రలో నటించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే ఈయనకు చెల్లెలుగా నటిస్తున్నారా లేక తనకు జోడిగా నటిస్తున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈమె ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాషలలో హీరోయిన్గా నటించి ఓ వెలుగు వెలిగారు. ఇలా హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నిరోషా కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా చాలా కాలం తర్వాత ఈమె ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలియడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈమె స్వయానా రాదికకు సోదరి అనే విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతాలు సమకూర్చుగా ఇప్పటికే ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తికా వచ్చింది. త్వరలోనే నిరోషా రజినీకాంత్ మధ్య జరిగే సన్నివేశాలను షూట్ చేయనున్నట్టు తెలుస్తుంది.