సెప్టెంబర్ నెల విజేత ఎవరు ?
అయినప్పటికీ భారీ అంచనాలు ఉన్న అనేక సినిమాలు సెప్టెంబర్ నెలలో విడుదలకు క్యూ కడుతూ ఉండటం ఇప్పుడు అయినప్పటికీ అనేక భారీ మీడియం రేంజ్ సినిమాలు ఈ నెలలో క్యూ కడుతూ ఉండటం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. సెప్టెంబర్ నెల సినిమా పండుగగా మారింది. సెప్టెంబర్ 1న సమంత విజయ్ దేవరకొండలు కలిసి నటించిన ‘ఖుషీ’ మూవీతో ఆనెల రేస్ మొదలుకాబోతోంది.
ఇప్పటికే ఈమూవీకి సంబంధించి విడుదలైన మొదటి పాటకు మంచి స్పందన రావడంతో అంచనాలు పెరుగుతున్నాయి. ఈసినిమా విడుదలైన కేవలం వారం రోజులకే షారుఖ్ ఖాన్ నయనతార నటించిన ‘జవాన్’ మూవీ విడుదల కాబోతోంది. ఈమూవీ పై కూడ భారీ అంచనాలు ఉన్నాయి. ‘పఠాన్’ మూవీ తరువాత వస్తున్న మూవీ కావడంతో ఈమూవీ పాన్ ఇండియా మూవీగా హిందీతో పాటు దక్షిణాది భాషలలొ ఒకేసారి వవిడుదల కాబోతోంది.
కేవలం మరొక వారం గ్యాప్ తో అదేనెల 15న సిద్దు జొన్నలగడ్డ రామ్ సినిమాలు ఒకదానిపై ఒకటి పోటీ పడుతున్నాయి. సిద్ధూ సినిమాకు ‘టిల్లు స్క్వేర్’ అని పేరు పెడితే రామ్ సినిమాకు ‘స్కంద’ అన్నపేరు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈసినిమాలు అన్నీ ఒక స్థాయివి అయితే సెప్టెంబర్ 28న ప్రభాస్ ప్రశాంత్ నీల్ ల ‘సలార్’ అత్యంత భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఈమూవీ పై కూడ చాల భారీ అంచనాలు ఉండటంతో ‘ఆదిపురుష్’ రిజల్ట్ తో సంబంధం లేకుండా ఈమూవీకి భారీ స్థాయిలో బిజినెస్ జరిగినది. ఇన్ని భారీ అంచనాలు ఉన్న సినిమాలు ఒకే నెలలో విడుదల అవుతున్న పరిస్థితులలో ఆనెల విజేత ఎవరు అన్న అంచనాలు ఎవరికీ అందడం లేదు..