బాలీవుడ్
బాద్షా షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ప్రస్తుతం ఆయన పిల్లలు సైతం పెద్దవారయ్యారు. ఆయన కూతురు సుహానా ఖాన్ కి సైతం చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసుకుని అందంతో మెరిసిపోతూ ఉంటుంది ఈమె. అలాగే ఆమె తన సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్గా కనిపిస్తుంది.తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ తన అభిమానులకు
మరింత దగ్గరవుతుంది అందాల భామ. తాజాగా ఆమెకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్
మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే తాజాగా సుహానా కాన్ ఒక ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేసింది అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో షికారులు చేస్తోంది. అయితే ఆమె కొనుగోలు చేసిన ప్రాపర్టీలో ఎకరన్నర భూమితో పాటు 2218 చదరపు అడుగుల్లో ఒక ఇల్లు సైతం ఉందని తెలుస్తోంది. అయితే దాని కోసం 77 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ముంబైలోనే అత్యంత ఖరీదైన ప్రాంతం అలీబాగ్ లోనే ఆమె ఈ ఇల్లుని కొనుగోలు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
అంతేకాదు అక్కడికి షారుక్ ఖాన్ ఇల్లు సైతం ఉంది. అలాగే
రణబీర్ కపూర్ విరాట్ కోహ్లీ అనుష్క శర్మ ఇల్లు సైతం అక్కడే ఉన్నాయి. అయితే సుహానా కొనుగోలు చేసిన ఆ ప్రాపర్టీ విలువ దాదాపుగా 1291 కోట్ల రూపాయలు అని తెలుస్తుంది. అయితే గతంలో సైతం ఆమె ఒక ప్లాట్ ని కొనుగోలు చేసినట్లుగా
బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపించాయి. దీంతో ఆమెకి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక సుహనా ఖాన్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆమె అర్జీస్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో ఆమె బాలీవుడ్కో ఎంట్రీ ఇవ్వబోతోంది..!!