నాకు డ్రగ్స్ తీసుకునే అలవాటుంది.. రజనీకాంత్ నిర్మాత షాకింగ్ కామెంట్స్?

praveen
సినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియా లో కాస్త ఎక్కువ గానే క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఒకప్పుడు ఇక సినిమాలకు నిర్మాత లుగా ఉన్న వ్యక్తులు ఎక్కువ గా సోషల్ మీడియా లో కనిపించే వారు కాదు. కానీ ఇటీవల కాలం లో మాత్రం సినిమాలకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న వారు మాత్రం అటు సోషల్ మీడియా లో బాగానే పాపులారిటీ సంపాదించుకుంటున్నారు అని చెప్పాలి. దీంతో హీరో హీరోయిన్లకు సంబంధించిన విషయాలే కాదు ఇక నిర్మాతలకు సంబంధించిన విషయాలకు కూడా సోషల్ మీడియా లో తెగ హాట్ టాపిక్ గా మారి పోతున్నాయి.



 అయితే సినీ సెలబ్రిటీలకు సంబంధించిన సినిమా అప్డేట్ లు మాత్రమే కాదు పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి కూడా ప్రతి ఒక్కరు ఎంతగానో ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ఒక స్టార్ నిర్మాత వ్యవహారం కాస్త సోషల్ మీడియా లో హార్ట్ టాపిక్గా మారి పోయింది. ఆలిండియా సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రజినీ కాంత్ హీరోగా నటించిన కబాలి సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన కేపీ చౌదరి ఇటీవల డ్రగ్స్ వ్యవహారం లో ఇరుక్కున్నారు అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమం లోనే ఇటీవల ఇదే విషయంపై స్పందించిన కేపీ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది అంటూ కేపీ చౌదరి స్పష్టం చేశారు. అయితే డ్రగ్స్ తీసుకొనే అలవాటు ఉన్నప్పటికీ.. సెలబ్రెటీలకు ఎప్పుడు డ్రగ్ సరఫరా చేయ లేదు అంటూ స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలకు కాలమే సమాధానం చెబుతుంది అంటూ కేపీ చౌదరి వ్యాఖ్యానించాడు. కాగా ఇటీవల కోవా నుంచి డ్రగ్స్ తరలిస్తున్న సమయం లో పోలీసులు అతని పట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఇక అటు చర్లపల్లి జైలుకు తరలించారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: