పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరంతేజ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా బ్రో ది అవతార్. ఈ సినిమాపై ఇప్పటికే అభిమానంలో భారీ అంచనాలు నెలకొన్న మల్టీ స్టారర్ గా ఈ సినిమాగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో పవన్ కి సంబంధించిన సన్నివేశల షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా సాయి ధరంతేజ్ సన్నివేశాలకు సంబంధించిన మరికొంత ప్యాచ్ వర్క్ మిగిలి ఉన్నట్లుగానే తెలుస్తుంది. అయితే తాజాగా ఈ సినిమా చిత్ర బృందం బ్రో మూవీ రషెస్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయినట్లుగా తెలుస్తోంది .సినిమా అవుట్ ఫుట్ చాలా అద్భుతంగా వచ్చిందని అంటున్నారు.దీంతో చిత్ర బృందం ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.
ఇక పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడం ఖాయం అన్న కామెంట్ సైతం వ్యక్తం అవుతున్నాయి. ఇక బ్రో సినిమా వినోదయ సీతం సినిమాకి రీమేగా తెరకెక్కుతుంది. పరిమిత బడ్జెట్ తోనే ఈ సినిమా వస్తుంది. ఇక ఈ సినిమాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రోజుకు రెండు కోట్లు రూపాయల రమ్నైజేషన్ను తీసుకున్నట్లుగా వార్తలు వినిపించాయి. అంతేకదు త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు తేజ్ ఇద్దరు కూడా ఈ సినిమా ప్రమోషన్స్లో పాల్గొనబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఇక విరూపాక్ష వంటి బ్లాక్ బస్టర్ తర్వాత తేజ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాకి ఒక ఇంత ప్లస్ అయింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఇక 2024 ఎన్నికలకు ముందు ఈ సినిమా విడుదల అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. అందరూ అనుకున్నట్లుగానే ఈ సినిమా మంచి సక్సెస్ సాధిస్తే ఇద్దరి కెరియర్ కి బాగా ప్లస్ అవుతుంది అని చెప్పాలి. ఇక సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పుడే భారీ అంచనాలు నెలకొన్న ఈ క్రమంలోనే ఈ సినిమా డైరెక్టర్ సముద్రఖని మాట్లాడుతూ ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్ లో గుర్తుండిపోయే సినిమాగా నిలుస్తుంది అని చెప్పుకొచ్చారు. అంతేకాదు భారీ కమర్షియల్ హిట్ ని సొంతం చేసుకుంటుందని సైతం ఆయన తెలిపాడు..!!