మతి పోగోడుతున్న రవితేజ రెమ్యూనరేషన్.. ఎంతో తెలుసా..!?

Anilkumar
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తాను ఏంటో నిరూపించుకున్నాడు రవితేజ. దాని తర్వాత మాస్ మహారాజా గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారిలో రవితేజ కూడా ఒకరు. ఫలితాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ కొత్త కొత్త దర్శకులను టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు మాస్ మహారాజా. ఇక  ఈ  ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. గత ఏడాది ధమాకా సినిమాతో ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని తన కథలు వేసుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. 


ఈ ఏడాది మొదట్లో  వాల్తేరు వీరయ్య సినిమాతో మరొక విజయాన్ని అందుకున్నాడు. దాని తర్వాత  రవితేజ నటించిన రావణాసుర సినిమా ఊహించన స్థాయిలో పరాజయాన్ని అందుకుంది.ఇక ఇప్పుడు మళ్లీ టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో నటిస్తున్నాడు. మాస్ మహారాజా. దాంతో పాటు త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో మరొక సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా రవితేజ రెమ్యూనరేషన్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే రవితేజ ఒక్కో సినిమాకి దాదాపు 20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. 


ఈ క్రమంలోనే ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ రవితేజకి ఏకంగా వంద కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఇవ్వడానికి రెడీ అయింది అన్న వార్త సోషల్ మీడియాలో షికారులు చేస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా రవితేజకు 100 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి రెడీ అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఇది ఒక సినిమా కోసం కాదు. పీపుల్స్ మీడియా సంస్థ రవితేజతో నాలుగు సినిమాలు చేస్తున్నారు. ఇందుకోసం మాస్ మహారాజా రవితేజ కి 100 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది.దీంతో ప్రస్తుతం రవితేజ రెమ్యూనరేషన్ ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: