మెగాస్టార్ అలాంటి నిర్ణయం తీసుకోడానికి కారణం అదేనా.....!!

murali krishna
పెళ్లైన 11 సంవత్సరాల తర్వాత ఉపాసన పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఈ శుభవార్త మెగా కుటుంబానికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. తన ఇంటికి సాక్షాత్తూ మహాలక్ష్మి వచ్చిందని చిరంజీవి కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.చిరంజీవి మనవరాలి జాతకం అద్భుతంగా ఉందని జ్యోతిష్కుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మెగా ప్రిన్సెస్ రాకతో చరణ్, చిరంజీవి కెరీర్ పరంగా మరింత ఎదుగుతారని కొంతమంది చెబుతున్నారు.అయితే అతి త్వరలో చిరంజీవి ఇండస్ట్రీకి చెందిన వాళ్ల కోసం పార్టీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. జ్యోతిష్కులు చెప్పిన విషయాల వల్ల మెగా ఫ్యామిలీ లో ఆనందం రెట్టింపైంది. అమృత ఘడియల్లో ఈ చిన్నారి జన్మించిందని సమాచారం అందుతోంది. మరోవైపు చరణ్ ఉపాసన చిన్నారికి ఏ పేరు పెడతారనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం.

ఈ చిన్నారికి సంబంధించి అద్భుతమైన పేరును ఫిక్స్ చేశారని తెలుస్తోంది. త్వరలో ఆ పేరును సైతం అధికారికం గా ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది. మరోవైపు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి వేదిక ఇంకా ఫిక్స్ కాలేదని బోగట్టా. విదేశాల్లోనే పెళ్లి జరగనుందని మెగా ఫ్యామిలీ మాత్రమే ఈ ఈవెంట్ కు హాజరు కానున్నారని తెలుస్తోంది. పెళ్లి విదేశా ల్లో జరిగినా హైదరాబాద్ లో రిసెప్షన్ గ్రాండ్ గా జరగనుందని సమాచారం అందుతోంది. వరుణ్ తేజ్ ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్ల తో బిజీగా ఉన్నారు. ఈ రెండు ప్రాజెక్ట్ లపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా లు వరుణ్ కు మంచి విజయాలను అందించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమా తో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్ లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల పై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. చిరంజీవి కెరీర్ విషయం లో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: