ప్రభాస్ సినిమా టైటిల్ చేంజ్.. కొత్త టైటిల్ ఏంటంటే?

praveen
హిట్టు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా.. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు అని చెప్పాలి. అయితే ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మిక్స్డ్ టాక్ తో ఇక బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంది ఈ సినిమా. అయితే మిక్స్డ్ టాక్ వస్తున్నప్పటికీ అటు వసూళ్ల విషయంలో మాత్రం దుమ్ము రేపుతుంది అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతుంది అని చెప్పాలి. ఇకపోతే అటు టాలీవుడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమాకు సైన్ చేశాడు.


 ఇక ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ హీరోయిన్గా నటిస్తుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకం  పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తూ ఉండడం గమానార్హం. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ 50% పూర్తయింది. అయితే ప్రభాస్ క్రేజ్ దృశ్య సినిమాకి రాజా డీలక్స్ అనే టైటిల్ సెట్ కాలేదు అని గతంలో టాక్ వినిపించింది. అయితే ఇక టైటిల్ చేంజ్ చేసే పనిలోపడ్డాడట డైరెక్టర్ మారుతి. అంబాసిడర్ లేదా రాయల్ అనే టైటిల్ లను పరిశీలిస్తున్నారట



 అయితే రాజా డీలక్స్ లేదా రాయల్ అనే టైటిల్స్ లలో ఏదో ఒకటి ఫైనలైజ్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నది తెలుస్తుంది. లేదంటే మరేదైనా బెటర్ టైటిల్ ఖరారు అవుతుందా లేదా అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ప్రభాస్ కోసం హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఒక మంచి కథను రాసుకున్నాడట మారుతి. ఇక ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాజా డీలక్స్ సినిమా ఒక థియేటర్ బ్యాక్ గ్రౌండ్ లో ఉంటుందట. ఇక ఈ సినిమాలో ప్రభాస్, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తాత మనవళ్ళుగా కనిపించబోతున్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: