మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్,
ఉపాసన దంపతులకు నిన్న ఉదయం(జూన్ 20) అపోలో హాస్పిటల్ లో పండంటి ఆడబిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. సుమారు 11 ఏళ్ల తర్వాత
రామ్ చరణ్ తండ్రి అవ్వడంతో మెగా ఫ్యామిలీతో పాటు ఫాన్స్ తెగ సంబరాలు జరుపుకుంటున్నారు. అటు
మెగాస్టార్ చిరంజీవి తాత అవ్వడంతో ఆయన ఆనందానికి అవధులు లేవు. ఇక ఫాన్స్ మాత్రం మెగా ఇంటికి మరో మహాలక్ష్మి వచ్చిందంటూ సోషల్
మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ ఇతరుణంలోనే
రామ్ చరణ్, ఉపాసనల మధ్య ఏజ్ గ్యాప్ ఎంతుందనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
రామ్ చరణ్ 1985
మార్చి 27
చిరంజీవి సురేఖ దంపతులకు జన్మించాడు. ప్రస్తుతం
రామ్ చరణ్ వయస్సు 38 సంవత్సరాలు. ఇక
ఉపాసన విషయానికొస్తే.. 1989 జూలై 20న
అనిల్ కామినేని,
శోభన కామినేని దంపతులకు జన్మించింది. ఇక ఈ ఇద్దరికీ జన్మించిన పాప పుట్టిన పుట్టిన తేదీ కూడా 20 వ తేదీ కావడం విశేషం. ఇక
రామ్ చరణ్, ఉపాసనల మధ్య సుమారు 4 సంవత్సరాల 8 నెలల గ్యాప్ ఉన్నట్లు తెలుస్తోంది. అంటే
రామ్ చరణ్ కన్నా
ఉపాసన దాదాపు నాలుగున్నర ఏళ్ళు పెద్దది. దీంతో ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ కాస్తా ఆశ్చర్యపోతున్నారు.
రామ్ చరణ్ కంటే
ఉపాసన అన్ని సంవత్సరాలు పెద్దదా అంటూ సోషల్
మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
కాగా మొదట ఫ్రెండ్స్ గా ఉన్న
రామ్ చరణ్,
ఉపాసన ఆ తర్వాత కొన్నాళ్లు ప్రేమించుకుని ఆ తర్వాత ఇంట్లో పెద్దలను ఒప్పించి కుటుంబ సభ్యుల సమక్షంలో
పెళ్లి చేసుకున్నారు. ఇక
రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం
శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' అనే భారీ పాన్
ఇండియా సినిమా చేస్తున్నాడు.ఈ
సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. అయితే
ఉపాసన ప్రెగ్నెంట్ కావడంతో గత రెండు నెలలుగా
రామ్ చరణ్ ఈ
సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చాడు.
టాలీవుడ్ బడా
నిర్మాత దిల్ రాజు సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్
ఇండియా స్థాయిలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న ఈ
మూవీ వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు తెలుస్తోంది..!!