ఇటలీలో ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్.. నెల రోజుల కోసం ఎంత ఖర్చు చేశాడో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ గురించి  పరిచయం అవసరం లేదు. ఇటీవల ఆది పురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ మరొక వైపు తను కమిట్ అయిన తదుపరి సినిమా షూటింగ్లో బిజీగా మారడు. అయితే ఈ సినిమా విడుదలైన క్రమంలో వెకేషన్ కోసం ఇటలీ వెళ్ళాడు ప్రభాస్. అక్కడే ఒక విల్లా సైతం అద్దెకు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా ఆ విల్లాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఆ విల్లా అద్దె ధర తెలిసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు.


 ఇక అసలు విషయం ఏంటంటే ప్రస్తుతం ఒక్కో సినిమాకి 100 నుండి 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా బిజీగా ఉంటున్నాడు .భారతదేశంలో ఒకేసారి నాలుగు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ఏకైక హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు మన ప్రభాస్. అయితే ఇంతకాలంగా తీరిక లేకుండా సినిమా షూటింగ్స్ లో బిజీగా మారిన ప్రభాస్ కొంత కాలం విరామం తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఇక దానికోసం ఇటలీ వెళ్ళాడట ప్రభాస్ .ఇక అక్కడే ఒకవేళ సైతం అద్దెకు తీసుకున్నడట.


అయితే ఆ విల్లా కోసం ప్రభాస్ నెలకు 40 లక్షల రూపాయలని చెల్లిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో దీనికి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది. అయితే షూటింగ్ విరామ సమయంలో అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి ప్రభాస్ ఈ ఇంటిని అద్దెకు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ క్రమంలోనే ఆది పురుష్ సినిమా రిలీజ్ ముందు మోకాలు చికిత్స కోసం యూకే వెళ్లాడట ప్రభాస్. అయితే తాజాగా ప్రభాస్ ఇటలీ వెకేషన్ కి వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దీని తర్వాత ఆయన తదుపరి సినిమా సలార్ కోసం సిద్ధంగా ఉన్నాడు ప్రభాస్. దీంతోపాటు తన నెక్స్ట్ సినిమా అయినా ప్రాజెక్ట్  K షూటింగ్స్ సైతం వేగంగా పూర్తి చేయబోతున్నట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: