గుంటూరు కారం చిత్రానికే ఎందుకలా జరుగుతోంది..?

Divya
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రీ లీల ,పూజా హెగ్డే నటిస్తూ ఉన్నారు. భారీ బడ్జెట్ తో హారిక అండ్ హాసిని క్రియేషన్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తూ ఉన్నారు. గత ఏడాది మేలో అఫీషియల్ గా ఈ సినిమాని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇప్పటికీ ఏడాది పూర్తి కావస్తున్న కేవలం కొద్దిపాటి షూటింగ్ మాత్రమే పూర్తిగా చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా సగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత మహేష్ కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూ ఉండడంతో షూటింగ్ మరింత ఆలస్యం అవుతూ వచ్చింది..

ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఈ సినిమాని విడుదల చేయాలని చిత్ర బృందం డేట్ ఫిక్స్ చేయగా కృష్ణ గారి మరణంతో షూటింగ్ పోస్ట్ పోన్ కావడంతో ఆగస్టు 11న విడుదల చేయాలని భావించారు.. అయితే ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. దీంతో కాస్టింగ్ కూడా ఖరారు కాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. మార్చిలో షూటింగ్ చేయాలనుకున్న సమ్మర్ ఎఫెక్ట్ వల్ల మహేష్ బాబు షూటింగ్ కి పెద్దగా ఆసక్తి చూపలేదని సమాచారం.

ఇప్పటివరకు ఈ సినిమా మూడో షెడ్యూల్ పూర్తి కాలేదని తెలుస్తోంది. జూలై మొదటి వారం నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. అయితే ఇంకా కంప్లీట్ గా క్యాస్టింగ్ ఎవరు ఖరారు చేయలేదట చిత్ర బృందం. మహేష్ బాబు కూడా ఎందుకు ఈ సినిమా పైన కాస్త ఆలస్యం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సంక్రాంతికి కూడా ఈ సినిమా రిలీజ్ కాకపోవచ్చని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.ఈ ఏడాది ఆఖరిలో రాజమౌళి సినిమాకు సంబంధించి వర్కుని మొదలు పెట్టాల్సి ఉంది మహేష్ బాబు.. మరి అప్పటికైనా ఈ సినిమాని త్రివిక్రమ్ పూర్తి చేస్తారు లేదా చూడాలి మరి. పవన్ నటిస్తున్న బ్రో సినిమాకి డైలాగులు స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: