ఇండస్ట్రి వర్గాలను ఆశ్చర్యపరిచిన ప్రభాస్ మ్యానియా !

Seetha Sailaja
ఒక టాప్ హీరోకి వరసగా రెండు ఫ్లాప్ లు వస్తే ఆతరువాత ఆ టాప్ హీరో నటించే సినిమాకు భారీ ఓపెనింగ్ కలక్షన్స్ రావడం సాధ్యమైన పనికాదు. అయితే దీనికి విరుద్ధంగా ప్రభాస్ మ్యానియా కనిపిస్తోంది అంటూ ఇండస్ట్రీ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి. ‘బాహుబలి’ తో నేషనల్ సెలెబ్రెటీగా మారిపోయిన ప్రభాస్ ఆతరువాత విడుదలైన ‘సాహో’ ‘రాధేశ్యామ్’ సినిమాల ఘోరమైన ఫ్లాప్ లతో ఊహించని షాక్ తిన్నాడు.

వాస్తవానికి ఇలాంటి వరస ఫ్లాప్ లు మరో హీరోకు వచ్చి ఉంటే అతడి ఇమేజ్ అదేవిధంగా అతడి మార్కెట్ పూర్తిగా పడిపోయి ఉండేది. అయితే ప్రభాస్ కు సంబంధించి ‘ఆదిపురుష్’ విషయంలో ఏమాత్రం జరగలేదు. మొదటి నుంచి ఆ మూవీ ఫలితం పై ఫిలిమ్ ఇండస్ట్రీ వర్గాలలో సందేహాలు ఉన్నప్పటికీ ఆ మూవీకి అత్యంత భారీ స్థాయిలో బిజినెస్ జరిగింది.

ఆమూవీకి మొదటిరోజు మొదటి షో నుండి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఆమూవీకి మొదటి మూడు రోజులలో 300 కోట్లు గ్రాస్ కలకక్షన్స్ వచ్చాయి. ఇక నాల్గవ రోజున అలాంటి భయంకరమైన నెగిటివ్ టాక్ ఉన్నప్పటికీ 30 కోట్ల గ్రాస్ ప్రపంచవ్యాప్తంగా వచ్చింది అంటున్నారు. ఇలాంటి కలక్షన్స్ మరో హీరో సినిమాకు వచ్చి ఉంటే అమూవీ బ్లాక్ బష్టర్ హిట్ అంటూ ప్రచారాలు చేసేవారు.

అయితే ‘ఆదిపురుష్’ జరిగిన బిజినెస్ స్థాయి వేరే రేంజ్ లో ఉండటంతో భారీ కలక్షన్స్ ను తెచ్చుకుని కూడ ‘ఆదిపురుష్’ మూవీ ఫ్లాప్ మూవీ మిగిలిపోయింది. దీనితో ప్రభాస్ కెరియర్ కు పరీక్షగా సెప్టెంబర్ లో రాబోతున్న ‘సలార్’ మూవీ రానున్నది. ఈమూవీ పై కూడ అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. ఆఅంచనాలను అందుకోవడంలో  ప్రభాస్  మళ్ళీ ఫెయిల్ అయితే అతడి  కెరియర్ కు తీవ్రసమస్యలు తప్పవు  అన్నసంకేతాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈవిశ్లేషణలు ప్రభాస్  అభిమానుల దృష్టి వరకు రావడంతో వారంతా తెగ టెన్షన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: