జూనియర్
ఎన్టీఆర్ ప్రస్తుతం
కొరటాల శివ కాంబినేషన్లో 'దేవర' సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు
జూనియర్ ఎన్టీఆర్ .కాగా ఈ సినిమాలో జాహ్నవి కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా
సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సీన్లు అత్యద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది .ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఒక రిస్క్ సీన్ ఉందని డూప్ లేకుండా అండర్ వాటర్ సీన్ ఫైట్ లో
జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు అన్న వార్తలు ఇప్పుడు సోషల్
మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సీన్స్ ఈ సినిమాకే హైలెట్ గా ఉంటాయని అంటున్నారు.
సముద్రం అడుగున తారక రిస్క్ చేస్తుండడంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్
మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది. సినిమాల కోసం
జూనియర్ ఎన్టీఆర్ ఎంత కష్టపడతాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఇప్పుడు సినిమాల కోసం ఆయన ఎంత కష్టపడతారో అన్నదానికి ఇదే మంచి సాక్ష్యం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. స్టార్
డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ
సినిమా బిగ్గెస్ట్ హిట్ ని అందుకోవాలని కోరుకుంటున్నారు ఆయన ఫ్యాన్స్. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాతో
జూనియర్ ఎన్టీఆర్ సినిమాల పరంగా మరింత ఎత్తుకు ఎదుగుతాడని కూడా భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే
జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాలని అత్యంత భారీ బడ్జెట్ తో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు .అంతేకాదు గతంతో పోలిస్తే ఇప్పుడు కథల ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఎన్టీఆర్. కథ నచ్చకపోతే సినిమాను రిజెక్ట్ చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
కొరటాల చెప్పిన కథ కూడా ముందు నచ్చకపోవడంతో
ఎన్టీఆర్ ఈ సినిమాని సెట్స్ పై తీసుకెళ్లేందుకు చాలా సమయం తీసుకున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ
సినిమా వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 5 న విడుదల కానుంది. రవిచంద్రన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాని
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి..!!