టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ నగరానికి ఏమైంది మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ నటుడు ఆ తర్వాత పలకనామా దాస్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో ఈయన హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి స్వీయ దర్శకత్వం కూడా వహించాడు. ఈ నగరానికి ఏమైంది సినిమాలో క్లాస్ పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించిన ఈ నటుడు పలకనామ దాస్ సినిమాలో పక్క ఊర మాస్ క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకులను అలరించాడు.
ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఈ నటుడు దాస్ కా దమ్కీ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో హీరో గా నటించాడు. అలాగే ఈ మూవీ కి కూడా విశ్వక్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో మోస్ట్ బ్యూటిఫుల్ నటి నివేత పేతురాజ్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో విశ్వక్ డ్యూయల్ రోల్ లో నటించాడు. ఇందులో హీరో గాను ... విలన్ గాను రెండు భిన్నమైన పాత్రలలో నటించిన విశ్వక్ ఈ మూవీ లో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను బాగానే అలరించాడు.
ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. అయినప్పటికీ ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులు మాత్రం ఈ చిత్ర బృందం చాలా రోజుల పాటు అమ్మి వేయలేదు. ఎట్టకేలకు ఈ సినిమా యొక్క శాటిలైట్ హక్కులను ఈ మూవీ బృందం అమ్మి వేసింది. ఈ మూవీ యొక్క సాటిలైట్ హక్కులను జీ తెలుగు సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ ని మరి కొన్ని రోజుల్లోనే జీ తెలుగు ఛానల్లో ప్రసారం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.