టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటి వరకు విడుదల అయిన మూవీ లలో రెండో రోజు అత్యధిక షేర్ కలక్షన్ లను వసూలు చేసిన టాప్ 5 మూవీ లు ఏవో తెలుసుకుందాం.
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ ... జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" మూవీ విడుదల అయిన రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 31.63 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఆది పురుష్ సినిమా జూన్ 16 వ తేదీన భారీ ఎత్తున తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయిన రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 15.04 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. దానితో ఈ మూవీ నాన్ "ఆర్ ఆర్ ఆర్" మూవీ కలెక్షన్ లను రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టింది.
రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా అనుష్క ... తమన్నా హీరోయిన్ లుగా రూపొందిన బాహుబలి 2 సినిమా విడుదల అయిన రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 14.80 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 1 మూవీ విడుదల అయిన రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 13.70 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.
కే జి ఎఫ్ చాప్టర్ 2 అనే కన్నడ డబ్బింగ్ సినిమా విడుదల అయిన రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 13.37 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో యాష్ హీరోగా నటించగా ... శ్రీ నిధి శెట్టి ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ప్రశాంత్ నీల్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.