మేం తీసింది.. రామాయణం కాదు.. రచయిత షాకింగ్ కామెంట్స్?

praveen
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమా ఇటీవల ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఓం రౌత్ దర్శకత్వంలో 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన  ఈ సినిమా భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైంది. అయితే ఇక ఎన్నో అంచనాలు పెట్టుకుని ప్రేక్షకులు థియేటర్కు వెళితే కొంతమంది ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా మెప్పించలేకపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే మొదటి రోజు నుంచి మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకుంటుంది ఆది పురుష్ సినిమా. అయితే మిక్స్డ్ టాక్ వస్తున్నప్పటికీ కూడా అటు వసూళ్ల విషయంలో మాత్రం దూసుకుపోతుంది. ఇక కొంతమంది అయితే రామాయణం లాంటి గొప్ప ఇతిహాసాన్ని అటు ఆది పురుష్ సినిమా ద్వారా అపహాస్యం చేశారు అంటూ విమర్శలు చేస్తున్నారు.



 రామాయణం లోని ఎన్నో సన్నివేశాలు అసలు రామాయణాన్ని వక్రీకరించే విధంగా ఉన్నాయి అంటూ విమర్శలు చేస్తూ ఉండడం కాస్త సంచలనంగా మారిపోయింది. అంతేకాకుండా హనుమంతుడితో బూతులు డైలాగులు చెప్పించారు అంటూ విమర్శలు వస్తున్నాయి. అయితే ఆది పురుష్ సినిమాపై వస్తున్న విమర్శలకు రచయిత మనోజ్ ముంత శీర్ శుక్ల స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మేము తీసింది రామాయణం కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు మనోజ్ ముంత శీర్.



 మేము రామాయణం ఇతిహాసం నుంచి ఎంతగానో స్ఫూర్తి పొందాము. ఈ విషయాన్ని మేము డిస్క్ క్లైమేర్ లో కూడా ప్రస్తావించాం. రామాయణంలో జరిగే యుద్ధంలో కేవలం ఒక భాగం ఆధారంగానే ఆది పురుష్ సినిమాను తెరకెక్కించాం. ఈ విషయాన్ని ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పాము కూడా. అయినప్పటికీ దీని గురించి మరోసారి వివరణ ఇస్తున్న. మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను తీసాం. అంతేకానీ మేము తీసింది సంపూర్ణ రామాయణం కాదు. ప్రేక్షకులు ఈ విషయాన్ని గమనించగలరు అంటూ మనోజ్ ముంతషేర్ చెప్పుకొచ్చాడు. మరి ఈ వివరణపై అటు ప్రేక్షకులు ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: