రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ఆది పురుష్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికి తెలిసింది. ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటించగా ... ఓం రౌత్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ సినిమా జూన్ 16 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ సినిమా రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ రెండు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ ల వివరాలు తెలుసుకుందాం.
ఈ సినిమాకు రెండు రోజుల్లో నైజాం ఏరియాలో 21.46 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ లో 5.26 కోట్లు , యూ ఏ లో 5.82 కోట్లు , ఈస్ట్ లో 3.72 కోట్లు , వేస్ట్ లో 2.82 కోట్లు , గుంటూరు లో 4.85 కోట్లు , కృష్ణ లో 2.65 కోట్లు , నెల్లూరు లో 1.30 కోట్ల కలెక్షన్ లను సాధించింది. మొత్తంగా ఈ సినిమాకు రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 47.88 కోట్ల షేర్ ... 74.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి రెండు రోజుల్లో కర్ణాటక ఏరియాలో 7.60 కోట్ల కలెక్షన్ లు దక్కగా , తమిళ నాడు ఏరియాలో 1.05 కోట్లు , కేరళ లో 42 లక్షలు , హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 36.30 కోట్ల కలెక్షన్ లు , ఓవర్ సీస్ లో 16.25 కోట్ల కలక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో 109.50 కోట్ల షేర్ , 218 కోట్ల గ్రాస్ కలక్షన్ లు దక్కాయి.
ఇది ఇలా ఉంటే ప్రభాస్ ఈ మూవీ లో రాముడి పాత్రలో నటించగా ... కృతి సనన్ ఈ మూవీ లో సీత పాత్రలో నటించింది.