కమల్ హాసన్ తో తలబడబోతున్న విజయ్ సేతుపతి....!!
ఈ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు కమల్ హాసన్. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో కమల్ హాసన్ తన 234వ చిత్రాన్ని మణిరత్నం దర్శకత్వంలో చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దానికంటే ముందు హెచ్ వినోద్ దర్శకత్వంలో ఒక సినిమాని చేయబోతున్నారు. ఇది ఆయన నటించే 233వ చిత్రం కానుంది. ఈ వయసులో కూడా ఏ మాత్రం తగ్గకుండా యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు కమల్ హాసన్. కాగా ఇది వ్యవసాయంతో పాటు పలు సామాజిక సమస్యల నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. వినోద్ చెప్పిన కథ నచ్చడంతో కమల్ హాసన్ ఇందులో నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి కథలో మార్పులు చేర్పులు చేసి మరింత పఠిష్టంగా తయారు చేసినట్లు సమాచారం. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించనున్న ఇందులో నటుడు విజయ్ సేతుపతి కూడా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. కాగా విజయ్ సేతుపతి ఈయన ఇంతకుముందు విక్రమ్ సినిమాలో ప్రతినాయకుడిగా నటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోనూ విలన్గా నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా షూటింగ్ను ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో త్రిష కథానాయికగా నటించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.