ప్రభాస్ సహా.. టాలీవుడ్ లో రాముడి పాత్రలో కనిపించిన హీరోలు వీళ్లే?
అయితే ఇప్పటికే ఎన్నో వందలసార్లు విన్నా చూసిన కథ రామాయణం. అయినప్పటికీ ఇక రామాయణం నేపథ్యంలో ఎన్ని సినిమాలు వచ్చిన ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సాధిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు సైతం రామాయణం లాంటి గొప్ప కథలో నటించాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కానీ కేవలం కొంతమందికి మాత్రమే ఈ అవకాశం లభించింది అని చెప్పాలి. మరి ఇప్పటివరకు వెండితెరపై రాముడు గెటప్ లో కనిపించి కనువిందు చేసిన హీరోలు ఎవరో తెలుసుకుందాం..
మొదటిసారి తెలుగు చిత్ర పరిశ్రమలో వెండితెరపై రాముడు పాత్ర పోషించింది ఎడవల్లి సూర్యనారాయణ. పాదుకా పట్టాభిషేకం సినిమాలో రాముడిగా నటించారు. ఇక ఈ సినిమా వచ్చిన కొన్నేళ్లకే శ్రీ సీతారామ జననం అనే సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు రాముడి పాత్రలో కనిపించాడు. ఇక ఆ మరుసటి ఏడాదే 1945లో సి ఎస్ ఆర్ ఆంజనేయులు పాదుక పట్టాభిషేకం సినిమా కోసం రాముడి గెటప్ వేశారు అని చెప్పాలి. ఇక రాముడి పాత్ర అనగానే ప్రతి ఒక్కరికి టక్కున గుర్తొచ్చేది సీనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ రాముడు వేషం వేశారంటే చాలు నిజంగా రాముడు ఇలాగే ఉంటాడేమో అని ప్రేక్షకులు భావించేవారు. లవకుశ, రామదాసు, శ్రీరామ పట్టాభిషేకం, శ్రీ రామాంజనేయ యుద్ధం సినిమాలో ఎన్టీఆర్ రాముని పాత్రలో నటించాడు.
ఇక కొన్నేళ్ళకే హరినాథ్ శ్రీరామ కథ సినిమాలో రాముడి పాత్రలో మెరిసారు. సీనియర్ నటుడు శోభన్ బాబు కూడా సంపూర్ణ రామాయణం సినిమాలో రాముడి పాత్రలో కనిపించారు. రెండో తరం హీరోల్లో సుమన్ శ్రీరామదాసు సినిమాలో రాముడు పాత్రలో కనిపించారు. ఇక చాలా ఏళ్ల తర్వాత బాలకృష్ణ శ్రీరామరాజ్యం సినిమాలో రాముడి పాత్రలో కనిపించారు. ఇక శ్రీకాంత్ దేవుళ్లు సినిమాలో.. ఇక ఇప్పుడు ప్రభాస్ ఆది పురుష్ సినిమాలో రాముడి గెటప్ లో కనిపించారు అని చెప్పాలి.