"లియో" మూవీ యూకే అండ్ యూరప్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయిన దళపతి విజయ్ తాజాగా వారిసు అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇలా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకులను ఎంత గానో అలరించిన ఈ నటుడు ప్రస్తుతం ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అయినటువంటి లియో సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తూ ఉండగా ... త్రిష ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
 


ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ 19 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి "నా రెడీ" అంటూ సాగే మొదటి లిరికల్ వీడియో సాంగ్ ను జూన్ 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రారంభించింది. ఈ సాంగ్ విడుదల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క యూకే అండ్ యూరప్ థియేటర్ హక్కులను ప్రముఖ సంస్థలలో ఒకటి అయినటువంటి అహింస ఎంటర్టైన్మెంట్ సంస్థ దక్కించుకుంది.


ఈ విషయాన్ని తాజాగా ఈ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ.పై తమిళ సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ తర్వాత విజయ్ ... వెంకట్ ప్రభు దర్శకత్వంలో  రూ మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేస్తుంది. ఇది ఇలా ఉండే తాజాగా దర్శకుడు వెంకట్ ప్రభు ... నాగ చైతన్య హీరోగా రూపొందిన కస్టడీ మూవీ కి దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: