టాలీవుడ్ అందాల చందమామ కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ లో సైతం ఆగకుండా దూసుకుపోతుంది. ప్రస్తుతం ఆమె వరుస అవకాశాలను దక్కించుకుంది. ఇప్పటికే బాలకృష్ణ నటిస్తున్న భగవంత్ కేసరి సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది కాజల్. దాంతోపాటు తమిళంలో కూడా ఇండియన్ టు సినిమాలో నటిస్తోంది కాజల్. వాటితో పాటు కొత్త కొత్త సినిమాలకి సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది .అయితే తాజాగా ఆమెకు లేదు ఓరియంటెడ్ సినిమా సైతం చేస్తోందని తెలుస్తోంది. కాజల్ 60 పేరుతో తాజాగా దానికి సంబంధించిన ఒక కొత్త సినిమాని ప్రకటించారు.
ఔరుమ్ ఆర్ట్స్ పథకం పై ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ లుక్ ని విడుదల చేశారు చిత్ర బృందం .ఇక ప్రి లుక్ లో రాత్రివేళ కాజల్ కారులో డ్రైవింగ్ చేస్తూ కనిపిస్తోంది. మిర్రర్లో కొద్దిగా కాజల్ కూడా కనిపిస్తోంది బ్లాక్ స్పెట్స్ పెట్టుకొని కార్ డ్రైవ్ చేస్తోంది కాజల్ .ఒక చేతిని కారులో బయటపెట్టి కనిపిస్తుంది కాజల్. చాలా బోర్డుగా కనిపించబోతుందని అంటున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ గ్లిప్స్ ని రేపు విడుదల చేయబోతున్నారట చిత్ర బృందం. ఇక కాజల్ నటిస్తున్న తన 60వ సినిమా ఇది. అయితే గతంలో ఆమె ఏ సినిమాలో కూడా కనిపించని విధంగా ఈ సినిమాలో కనిపించబోతుందని
టీం తెలపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది .దీంతో ఈ సినిమాలో కాజల్ ఎలా కనిపిస్తుంది తన నటన ఎలా ఉంటుంది అంటూ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే కాజల్ లేడీ ఓరియంటెడ్ సినిమాల వైపు వెళుతుందేమో అన్న ప్రశ్న సైతం వెలుగులోకి వస్తుంది. దీంతో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇక కాజల్ సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో ముంబై కి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లోని ప్రేమ వివాహం చేసుకుంది .ఇక వీరికి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇక పెళ్లి తర్వాత కాజల్ మరింత హాట్ గా తయారైంది .ప్రస్తుతం సినిమాలతో బిజీ అయిన కాజల్ ఇటీవల మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది అంటూ వార్తలు వస్తున్న వారిపై ఎలా స్పందిస్తుందో చూడాలి...!!