ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీకి పరిచయమై స్టార్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ.హీరోగా పరిచయమైన కొత్తలో భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు ఆయన. ఇక అదే జోష్లో గత ఏడాది లైగర్ అనే పాన్ ఇండియా సినిమాలో నటించాడు విజయ్ దేవరకొండ. కానీ ఊహించిన విధంగా ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. అయినప్పటికీ ఏమాత్రం వినకడుగు వేయకుండా ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా మారాడు విజయ్ దేవరకొండ .ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆయన ఖుషి సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.
శివ నిర్వణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ క్రమంలోనే తన 12వ సినిమాను జెర్సీ ఫెమ్ గౌతం తిననూరితో చేస్తున్నట్లుగా అఫీషియల్ గా ప్రకటించడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా తరువాత వెంటనే తన పదమూడవ సినిమాని పరశురాం పెట్ల దర్శకత్వంలో చేయనున్నట్లు కూడా వెల్లడించాడు. దిల్ రాజు నిర్మించబోతున్న ఈ సినిమాను రెండు రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించడం జరిగింది.
ఈ మేరకు తాజాగా హైదరాబాద్లో ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ సినిమాకి చాలా డిఫరెంట్ టైటిల్ పెట్టాలని భావిస్తున్నారట చిత్ర బృందం.ఈ క్రమంలోనే దిల్ రాజు ఈ సినిమా టైటిల్ కోసం రెండు పేర్లను ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించినట్లుగా తెలుస్తోంది. అందులో ఒకటి ఫ్యామిలీ స్టార్ కాగా మరొకటి కుటుంబరావు అని తెలుస్తోంది. ఈ రెండు టైటిల్స్ లో ఏదో ఒకటి ఫిక్స్ చేస్తారని తెలుస్తోంది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో మృనాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోంది. కాగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ చాలా డీసెంట్ లుక్ లో కనిపించపోతున్నాడని తెలుస్తోంది..!!