ఆ హీరోయిన్ ని బాగా ఇబ్బంది పెట్టిన లారెన్స్....!!

murali krishna
నటుడిగా మరియు కొరియోగ్రాఫర్ గా సౌత్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాఘవ లారెన్స్ అంటే తెలియని వారు ఉండరు. అయితే రాఘవ లారెన్స్ గురించి చాలామంది గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఆయన కేవలం సినిమాల పరంగానే కాకుండా సమాజంలో చాలామంది అనాధలకు,పేద ప్రజలకు సేవ చేస్తూ ఉంటారని ఇప్పటికే ఇండస్ట్రీలో టాక్ ఉంది. అయితే అలాంటి రాఘవ లారెన్స్ హీరోయిన్ల విషయంలో మరీ ఇంత కఠినంగా ప్రవర్తిస్తారా అంటూ తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది.మరి రాఘవ లారెన్స్ ఏ హీరోయిన్ విషయంలో కఠినంగా వ్యవహరించారో ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమంది హీరోయిన్లు షూటింగ్ సెట్ కి రాకపోయినా లేదా షూటింగ్ సెట్ కి వచ్చాక పొగరుగా ప్రవర్తించినా డైరెక్టర్లు, హీరోలు, నిర్మాతలు షూటింగ్స్ సెట్లోనే వారికి వార్నింగ్లు ఇచ్చిన సంఘటనలు ఇప్పటికే చాలామంది హీరోయిన్ల విషయంలో మనం చూసాం. అయితే ఇలాంటి సంఘటన రాఘవ లారెన్స్ హీరోగా చేసిన మొట్ట శివ కెట్ట శివ సినిమా షూటింగ్లో జరిగిందట.

ఇక ఈ సినిమా షూటింగ్ జరిగే టైంలో నిక్కీ గల్రాని  ఓసారి షూటింగ్ సెట్ కి ఆలస్యంగా వచ్చిందట. దాంతో రాఘవ లారెన్స్ కి చాలా కోపం వచ్చిందట. కానీ ఆ కోపాన్ని ఎలా ప్రదర్శించాలో తెలియక ఒక పెద్ద రూమ్ లో డ్యాన్స్ షాట్ ని ఎలాంటి కట్స్ చేయకుండా చేయమని నిక్కీ గల్రానికి చెప్పారట.అయితే ఈ షార్ట్ ఎన్నిసార్లు చేసినా కూడా నిక్కీ గల్రాని చేయలేక పోయిందట.అయితే ఈ లాంగ్ డాన్స్ షాట్ చేయడానికి సాయంత్రం అయిపోయిన కూడా నిక్కి గల్రాని ఆ షార్ట్ పూర్తి చేయలేక పోయిందట.దాంతో నిక్కీ గల్రాని తన తప్పు తెలుసుకుని లారెన్స్ దగ్గరికి వెళ్లి క్షమించమని కన్నీళ్లు పెట్టుకుందట.దాంతో రాఘవ లారెన్స్ కరిగిపోయి ఇంకోసారి ఇలాంటి పనులు ఎప్పుడు చేయకు అని ఆ డాన్స్ షాట్ ని నాలుగు కట్స్ చేసి కేవలం గంట లోనే ఆ డ్యాన్స్ ని పూర్తి చేయించారట. అయితే అప్పట్లో రాఘవ లారెన్స్ చేసిన పనిని కొంతమంది మెచ్చుకుంటే మరి కొంతమంది విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: