టాలీవుడ్ హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగు అమ్మాయి అయిన ఈ ముద్దుగుమ్మ కెరీర్ బిగినింగ్ లో తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేసి అక్కడ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. ఆ తర్వాత పలువురు అగ్ర హీరోలకు జోడిగా నటించి మెప్పించింది. అయితే గత కొంతకాలంగా ఈ హీరోయిన్ కి హీరోల సరసన నటించే అవకాశాలు రాకపోవడంతో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. అలా ఇప్పటికే పలు లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేసిన అంజలి రీసెంట్గా వెబ్ సిరీస్ లలో నటించడం మొదలుపెట్టింది. ప్రస్తుతం అంజలికి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మంచి మార్కెట్ ఉంది.
తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వెబ్ సిరీస్ లో చేస్తూ తన కెరీర్ని చక్కగా ప్లాన్ చేసుకుంటుంది. రీసెంట్గా ఝాన్సీ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చిన అంజలి ఇప్పుడు త్వరలోనే మరో వెబ్ సిరిస్తో రాబోతోంది. అంజలి నటిస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ పేరు 'బహిష్కరణ'. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ZEE5 లో రిలీజ్ కాబోతున్న ఈ వెబ్ సిరీస్ ని ముఖేష్ ప్రజాపతి అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈరోజు అంజలి పుట్టినరోజు సందర్భంగా ఈ వెబ్ సిరీస్ నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఇక ఈ ఫస్ట్ లుక్ కాస్త వెబ్ సిరీస్ పై క్యూరియాసిటీని పెంచేసింది. ఈ ఫస్ట్ లుక్ ని ఒకసారి గమనిస్తే.. ఎర్ర బస్సు దిగి ఊరిలోకి వస్తున్న పక్కా పల్లెటూరి అమ్మాయిలా అంజలి అనిపించింది. అంతేకాకుండా ఈ పోస్టర్లో అంజలి ముందు ఓ కంచె కూడా ఉంది.
ఆ కంచెని అంజలి ఎలా దాటుతుంది అనే విషయాన్ని దర్శకుడు ఈ పోస్టర్లో చూపించే ప్రయత్నం చేశాడు. ఇక ఈ పోస్టర్లో అంజలి లుక్ చాలా హోమ్లీగా ఉంది. దీనికంటే ముందు గత ఏడాది ఇదే వెబ్ సిరీస్ నుంచి ఓ పోస్టర్ని రిలీజ్ చేయగా ఆ పోస్టర్లో అంజలి గ్లామర్ లుక్ తో అదరగొట్టింది. ఇక ఇప్పుడు విడుదల చేసిన పోస్టర్లో మాత్రం అంజలి చాలా హోమ్లీగా కనిపిస్తోంది. దీన్నిబట్టి ఈ వెబ్ సిరీస్ లో అంజలి రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నట్లు స్పష్టం అవుతుంది. ఇక తాజాగా విడుదలైన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ నేటిజన్స్ ని ఆకట్టుకుంటుంది. దీంతో పలువురు నెటిజన్లు ఈ పోస్టర్ ని షేర్ చేస్తూ అంజలికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా జూలై మూడో వారంలో ఈ వెబ్ సిరీస్ విడుదల కానున్నట్లు సమాచారం...!!