హిందీ బిగ్ బాస్ లో సందడి చేయబోతున్న మాజీ పోర్న్ స్టార్....!!
ఈ సారి బిగ్ బాస్ షోను సల్మాన్ ఖాన్ హోస్ట్ చేయనున్నారు. హిందీ బిగ్ బాస్ రెండో సీజన్ పై ఉత్కంఠ నెలకొంది. ఈ సందర్భం గా ఈ షోలో ఎవరు పాల్గొంటున్నారన్న విషయం పై ఆసక్తి నెలకొంది. అయితే తాజా గా మాజీ పోర్న్ స్టార్, మియా ఖలీఫా ను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పార్ట్ టైమ్ మోడల్ గా కెరియర్ ఆరంభించిన మియా ఖలీఫా శృంగార తార గా మారి ప్రపంచ వ్యాప్తం గా ఫ్యాన్స్ ను సంపా దించుకుంది. ఇండియా లో కూడా సన్నిలియోన్ తర్వాత అంతటి క్రేజ్ సంపాదిం చుకున్న బ్యూటీ మియా ఖలీఫానే.
బిగ్ బాస్ సీజన్ 2లో భాగం గా బిగ్ బాస్ వర్గాలు మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా ను సంప్రదిం చినట్లు వార్తలు వస్తున్నాయి. హిందూస్థాన్ టైమ్స్ లోని ఒక నివేదిక ప్రకారం, మియా మరియు రాజ్ కుంద్రా ఇద్దరి కోసం సంప్రదింపులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, దీని గురించి అధికారిక సమాచారం వెలువడలేదు కానీ, మియా ఖలీఫా కనుక బిగ్ బాస్ షోకు అంగీకరిస్తే అది ఖచ్చితం గా వేరే లెవెల్ లో ఉంటుందని బిగ్ బాస్ వర్గాలు అంటున్నాయి.