రామ్ చరణ్ ధ్రువ సినిమాలో విలన్ పాత్ర మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..!?

Anilkumar
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో ధ్రువ సినిమా కూడా ఒకటి. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టైలిష్ మేకర్ గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హీరో గా నటించాడు రాం చరణ్. ఇక ఈ  సినిమాలో రామ్ చరణ్ నటన యాక్షన్ సీన్స్ కు మంచి మార్కులే పడ్డాయి. కాగా తమిళంలో వచ్చిన తని ఒరువన్ సినిమాకి రీమేగా ఈ సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు. రామ్ చరణ్ తన సిక్స్ ప్యాక్ బాడీ తో అందరినీ ఎంతలా ఆకట్టుకున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా ఈ సినిమాలో విలన్ గా


 నటించాడు ప్రముఖ అన్నట్టుడు అరవిందస్వామి.ఇక అరవిందస్వామి హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరోకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో విలన్ కి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. అయితే తాజాగా దీనికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమాలో ముందుగా విలన్ పాత్ర కోసం అరవింద్ స్వామిని అనుకోలేదట దర్శక నిర్మాతలు. ముందుగా ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం కింగ్ నాగార్జున అని అనుకున్నాడు సురేందర్ రెడ్డి. అంతే కాదు సురేందర్ రెడ్డి ముందుగా విలన్ పాత్ర కోసం నాగార్జున


 దగ్గరికి వెళ్లి ఆయనని సంప్రదించారట. కథ కూడా విని ఓకే కూడా చేశారట నాగార్జున. కానీ దాని తర్వాత నో చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి దాని తర్వాత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ని సైతం సంప్రదించాడట దర్శకుడు. కానీ ఆ సమయంలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా కొనసాగుతున్నాడని విలన్ గా నటించనని చెప్పాడట. దాంతో తమిళ్లో నటించిన అరవింద స్వామిని ఈ సినిమాలో విలన్ గా ఫిక్స్ చేశారట సురేందర్ రెడ్డి. దీంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ధ్రువ సినిమాకి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అక్కినేని ఫ్యాన్స్ అనవసరంగా మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నావ్ కామెంట్స్ పెడుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: