ఆస్కార్ అవార్డ్ .. ఆయనకే ఇవ్వాలి వర్మ ట్విట్ వైరల్..!!
నారా లోకేష్ ప్రస్తుతం యువగలం పేరిట ఒక పాదయాత్రను కూడా చేస్తున్న సంగతి తెలిసిందే చిత్తూరులో ప్రారంభించిన ఈ పాదయాత్ర రాయలసీమలోని నాలుగు జిల్లాలలోని ఈ పాదయాత్ర పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇలా రాయలసీమలో పాదయాత్ర పూర్తి చేసుకున్న తర్వాత నేలను తాకుతూ ఒక నమస్కారం వంటిది చేశారు నారా లోకేష్.. అందుకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ ఫోటోని రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. తనదైన స్టైల్ లో ఒక సెటైరికల్ ట్విట్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఈ ఫోటోని షేర్ చేసిన వర్మ ఈ ఫోటో గురించి స్పందిస్తూ చలన సినీ పరిశ్రమలో అందించే అవార్డులలో ఆస్కార్ అవార్డు చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు.. ఇలా తెలుగు సినీ పరిశ్రమకు rrr సినిమా అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే... అయితే ఆ అవార్డు రాజమౌళి, కీరవాణి ,ఎన్టీఆర్ ,రామ్ చరణ్ లకు కాకుండా కచ్చితంగా నారా లోకేష్ కు ఇవ్వాలంటూ లోకేష్ పైన సెటారికల్ ట్వీట్ చేయడం జరిగింది. ఈ క్రమంలోని వర్మ చేసిన పోస్ట్ పై పలువురు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. వర్మ చేసిన ప్రస్తుతం వైరల్ గా మారుతోంది.