మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి సమంత గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈనటి ఏం మాయ చేసావే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి ఈ మూవీ తోనే అద్భుతమైన గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. ఆ తర్వాత వరుసగా సమంత టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోల సరసన సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంది. అందులో భాగంగా ఈనటి అతి తక్కువ కాలంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థానానికి చేరిపోయింది.
ఇప్పటికి కూడా సమంత టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో తన కెరీర్ ను ముందుకు సాగిస్తుంది. ఆఖరుగా ఈ నటి శాకుంతలం అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ప్రస్తుతం సమంత ... విజయ్ దేవరకొండ హీరోగా శివ నర్వాన దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషి అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను సెప్టెంబర్ 1 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇలా వరుస సినిమా లతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈనటి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది.
అందులో భాగంగా తాజాగా సమంత తన సోషల్ మీడియా అకౌంట్ లో పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉన్న శారీని కట్టుకొని ... పింక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి ఉన్న ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం సమంత కు సంబంధించిన ఈ క్లాస్ లుక్ లో ఉన్న ఈ ఫోటో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.