ఆదిపురుష్ ఓటిటిలో విడుదల అయ్యేది అప్పుడే..!?

Anilkumar
కోట్లాదిమంది అభిమానులు మరియు సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు అని వేయికళ్లతో ఎదురుచూస్తున్న సినిమా ఆది పురుష్.మరొక రెండు రోజుల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ త్వరలో బిజీగా ఉన్నారు చిత్ర బృందం. సెన్సార్ బోర్డు నుండి క్లీన్ యు సర్టిఫికెట్ని తెచ్చుకున్న ఈ సినిమా 2D  మరియు 3d లో కూడా రాబోతోంది. ఈ క్రమంలోనే 3d కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇండియా వైడ్ హిందీ వెర్షన్ కి అద్భుతమైన రెస్పాన్స్ రావడం జరిగింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమాకి సంబంధించిన


 అడ్వాన్స్ బుగింగ్స్ ఇంకా ప్రారంభం కాలేదు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓటిటి స్ట్రీమింగ్ విషయంలో మేకర్ చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. అదేంటంటే ఈ సినిమా థియేటర్స్ లో విడుదలైన ఎనిమిది వారాల తరువాతే ఓటీటి లో విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వబోతున్నారట మేకర్స్. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓటీటి రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ సంస్థ కొనుగోలు చేసింది. సుమారుగా 150 కోట్ల రూపాయలకు తెలుగు హిందీ తమిళ మలయాళం మరియు హిందీ భాషల్లో శ్రమించే హక్కులను కొనుగోలు చేసింది ఈ సంస్థ.


 అయితే ఈ మధ్యకాలంలో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అయినా సరే నెల రోజులు లోపే ఓటీటిలోకి వచ్చేస్తుంది .అలాంటిది ఎనిమిది వారాల తరువాతే ఈ సినిమా ఓటిటి విడుదల అంటే మాకు నష్టం కలుగుతుందని దయచేసి ఎనిమిది వారాలను కాస్త నాలుగు వారాలు చేయమని అమెజాన్ ప్రైమ్ సంస్థ మేకర్స్ కి రిక్వెస్ట్ చేయగా మేకర్స్ మాత్రం ఒప్పుకోలేదు. కానీ ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే గనక నాలుగు వారాల్లోనే స్ట్రీమింగ్ చేయడానికి ఒప్పుకుంన్నారట మేకర్స్. దీంతో ఈ సినిమాకి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: